Kitchen

కోడిగుడ్డు మసాలా

కావలసిన పదార్ధాలు
కోడిగుడ్డు 4
పెద్ద ఉల్లిపాయలు 2
టమాట 1
పచ్చి మిరపకాయలు 2
కారం 1 టీస్పూన్
పసుపు 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి 1 టీస్పూన్
ధనియాల పొడి 1 టీస్పూన్
కరివేపాకు 1 రెమ్మ
ఉప్పు తగినంత
నూనె 3 టేబుల్ స్పూన్

తయారి విధానం
కోడిగుడ్డులు బాగా ఉడికించాలి. గుడ్డు పొట్టుతీసి, అక్కడక్కడా నిలువగా గీతలు పెట్టాలి. ఉల్లిపాయలు సన్నగా కోసి ఉంచుకోవాలి. ఒక్కో టమాటాని ఆరు ముక్కలుగా కోసుకోవాలి. పచ్చి మిరపకాయలు చీలికలుగా కోసుకోవాలి. ఒక పాన్ లోకి నూనె తీసుకొని వేడి చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలిపి బాగా వేగించాలి. దీనికి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి బాగా వేగించాలి. ఎప్పుడైతే మసాలా దగ్గరకు అవుతుందో, అప్పుడు కోడిగుడ్లు వేసి కలుపుకోవాలి. 5 నిముషాలు ఆలా ఉంచి
మంట మీదనుంచి దించాలి.అన్నంతోగాని లేదా చపాతీతో గాని వేడివేడిగా వడ్డించండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."