ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తో ప్రపంచ స్థాయిలో పేరు వచ్చేసింది. సినిమా బ్యాక్గ్రౌండ్ తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా పెద్దగా హిట్ కాలేదు. అలా సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేసరికి చత్రపతి సినిమా హిట్ అయింది. ఇంకా ఆ తర్వాత వెను తిరిగి చూడకుండానే ముందడుగు వేశాడు. ఆ తర్వాత డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేశాడు అవి హిట్ అయ్యాయి ఆ తర్వాత సొంత బ్యానర్లో రెబల్ సినిమా చేశాడు

ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. ఆ తర్వాత మిర్చి సినిమాతో హిట్ బాట పట్టాడు. ఆ తర్వాత బాహుబలి సినిమా హిట్ అయ్యాక సాహో సినిమా చేశాడు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా ఆ రెంజ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగగా తమిళ్ టీచర్ అని చెప్పాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది