Movies

బిగ్ బాస్ అఖిల్ రియల్ లైఫ్ … ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ప్రస్తుతం బిగ్ బాస్ నాల్గవ సీజన్ నడుస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోకి వచ్చిన 16మంది కాటెస్టెంట్స్ లో అఖిల్ సార్థక్ ఒకడు. బిగ్ బాస్ హౌస్ లో తనదైన నటనతో ఆడియన్స్ అభిమానం పొందుతున్నాడు. కంటెస్టెంట్స్ లో గంగవ్వ అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు.

నిజానికి 2014లో వచ్చిన బావా మరదళ్ళు మూవీలో విలన్ గా చేసిన అఖిల్ 1995లో నవంబర్17న హైదరాబాద్ లో జన్మించాడు. సిల్వర్ స్కూల్లో చదివి, హైదరాబాద్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. నటన మీద గల మక్కువతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు.

కానీ సినిమాల్లో పెద్దగా కల్సి రాకపోవడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో ఛాన్స్ లు దక్కించుకున్నాడు. ముత్యాల ముగ్గు, ఎవరే నువ్వు, మోహిని, కళ్యాణి తదితర సీరియల్స్ తన నటనతో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నాడు.