దర్శకేంద్రుని కాంబినేషన్ లో సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు , సూపర్ స్టార్ కృష్ణ కాంబి నేషన్ కి ఫాన్స్ లో ఓ క్రేజ్ ఉంది. సినిమాకు కమర్షియల్ హంగులు అద్దడంలో దర్శకేంద్రుడి స్టైల్ ఎవరికీ రాదు. గ్లామర్ గా చూపించడం,సీన్లు పండించడంలో దిట్ట. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో భలే కృష్ణుడు మూవీ వచ్చింది. 1980సంక్రాతి రోజున వచ్చిన ఈమూవీ కృష్ణకు 189వ చిత్రం. ఇందులో జయప్రద,సంగీత హీరోయిన్స్ గా చేసారు. ఎన్టీఆర్ ఛాలెంజ్ రాముడు,అక్కినేని ఏడంతస్తుల మేడ , కృష్ణంరాజు శివమెత్తిన సత్యం అప్పుడే వచ్చాయి. అయితే భలే కృష్ణుడు వెనుకబడింది.

ఇక రెండవ మూవీగా ఘరానా దొంగ వచ్చింది. జంధ్యాల ,సత్యానంద్ కథను అందించిన ఈ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. ఇక 1981లో వచ్చిన ఊరికి మొనగాడు మూవీ బంపర్ హిట్ అయింది. ఆ ఏడాది శ్రీవారి ముచ్చట్లు అక్కినేని హిట్ ఇవ్వగా, దానికి కొనసాగింపుగా కృష్ణ మూవీ ఊరికి మొనగాడు సత్తా చాటింది. అదే ఏడాది ప్రేమాభిషేకం మూవీ వచ్చినా, దాని ముందు కూడా కృష్ణ మూవీ కొనసాగింది. ఇక తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి సినిమా తియ్యడం అడవి సింహాలు మూవీతో స్టార్ట్ అయింది.

తెలుగులో కృష్ణ,కృష్ణంరాజు,హిందీలో జితేంద్ర ,ధర్మేంద్ర కల్సి నటించిన ఈ మూవీ రెండు భాషల్లోనూ శ్రీదేవి,జయప్రద హీరోయిన్స్ గా నటించారు. అయితే పెద్దగా ఆడలేదు. అయితే దానితర్వాత కృష్ణ ద్విపాత్రాభినయంతో వచ్చిన శక్తి మూవీ సూపర్ హిట్. జయసుధ,రాధ హీరోయిన్స్ గా నటించారు. ఇక వీరిద్దరి కాంబోలో బిగ్గెస్ట్ హిట్ అగ్నిపర్వతం. ఇందులో విజయశాంతి,రాధ నటించారు. కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక శోభన్ బాబు,కృష్ణ హీరోలుగా నటుడు కైకాల సత్యనారాయణ తీసిన ఇద్దరు దొంగలు మూవీకి రాఘవేంద్రరావు డైరెక్టర్. రాధ,జయసుధ హీరోయిన్స్ . ఇది హిట్ అయింది. ఇక కృష్ణ,రాఘవేంద్రరావు కాంబోలో చివరి మూవీ వజ్రాయుధం. శ్రీదేవి హీరోయిన్ గా చేసింది. సినిమా బాగానే ఆడింది.

error: Content is protected !!