కృష్ణ, వాణిశ్రీ మధ్య గొడవకు కారణం ఇదే… అసలు నమ్మలేని నిజం
తమిళంలో శివాజీ గణేశన్,సావిత్రి నటించిన మూవీని తెలుగులో మరపురాని కథ పేరిట రీమేక్ చేసారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా చేసారు. అయితే అప్పటివరకూ సహాయనటి,చెలికత్తె వేషాలు వేస్తూ వచ్చిన వాణిశ్రీ కి ఈ మూవీ తో కెరీర్ మలుపు తిరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో మరో రీమేక్ మూవీ లక్ష్మీ నివాసం వచ్చింది. ఇందులో శోభన్ బాబు కూడా నటించారు. ఆతర్వాత ఆస్తులు అంతస్తులు మూవీ కూడా తమిళంలో వచ్చిన చిత్రం ఆధారంగా తీసిందే. తమిళంలో జెమిని గణేశన్,బి సరోజాదేవి చేసిన పాత్రలను తెలుగులో కృష్ణ , వాణిశ్రీ చేసారు. వీరిద్దరి జోడీగా నాలుగో చిత్రం జగత్ కిలాడీలు మూవీ వచ్చింది.
తర్వాత పెళ్లి సంబంధం మూవీలో కృష్ణ, విజయనిర్మల ఒక జంటగా, మరో జంటగా కృష్ణం రాజు వాణిశ్రీ నటించారు. ఇక ప్రభాకర రెడ్డి నిర్మాతగా అవతారం ఎత్తి తీసిన పచ్చని కాపురం మూవీలో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించారు. తర్వాత అత్తలూ కోడళ్ళు మూవీలో పల్లెటూరి యువకుని పాత్రలో కృష్ణ నటించగా, తెలివైన కోడలుగా వాణిశ్రీ నటించింది. అదే సమయంలో మోసగాళ్లకు మోసగాడు మూవీ షూటింగ్ అవుతోంది. ఇక కృష్ణతో వివిధ పాత్రలు వేయించిన ఘనత డైరెక్టర్ వి రామచంద్రరావు కి దక్కింది. ఈయన తెరకెక్కించిన అబ్బాయిగారు,అమ్మాయిగారు మూవీలో కృష్ణ ప్రేయసిగా వాణిశ్రీ, భార్యగా గీతాంజలి నటించారు. అయితే వాణిశ్రీని కాదని గీతాంజలిని భార్యగా పెట్టడంపై విజయ సంస్థ అధినేత చక్రపాణి ఆరోజుల్లో వ్యాఖ్యానించారు. ఇక కృష్ణ తొలి జానపద మూవీ మహాబలుడు మూవీలో వాణిశ్రీ మూడు పాత్రలు వేసింది.
ఇక ఇల్లు ఇల్లాలు మూవీలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసారు. అలాగే తమిళ రీమేక్ గా వచ్చిన శ్రీవారు మావారు మూవీలో కృష్ణ వాణిశ్రీ జంటగా నటించారు. మరపురాని కథలో కృష్ణ డాక్టర్ గా వేశారు. ఇక మలయాళ మూవీ ఆధారంగా వింత కథ మూవీలో కృష్ణ వాణిశ్రీ పూర్తి కథ విన్నాకే నటించారు. హిందీలో హిట్ కొట్టిన సీతా ఔర్ గీత ఆధారంగా తెలుగులో గంగ మంగ మూవీగా చేసారు. విజయ సంస్థ లో కృష్ణ ,శోభన్ బాబు నటించడం ఇదే తొలిసారి. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది. సత్యానికి సంకెళ్లు మూవీ చేసాక, కాశ్మిర్ లో తొలిసారి కృష్ణ చేసిన చీకటి వెలుగులు మూవీలో కూడా వాణిశ్రీ హీరోయిన్ గా చేసింది. దీని తర్వాత మరో మూవీ ఇద్దరు కల్సి చేయలేదు. దీనికి మనస్పర్థలే కారణం.
ప్రపంచ తెలుగు మహాసభల కోసం విరాళాలు సేకరించాలని భావించి, ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వైజాగ్ లో కాంచన అత్తగా, వాణిశ్రీ కోడలుగా ఓ నాటకం ప్రదర్శించారు. అదే సమయానికి ఎన్టీఆర్,వాణిశ్రీ నటించిన కథానాయకుని కథ మూవీ రిలీజయింది. నాటకంలో నారాయణ ఎక్కడ అని అత్త అడిగితె,అక్కినేని నటించిన దేవదాసు మూవీకి టికెట్లు దొరకడం లేదు, కథానాయకుని కథ సినిమాకు టికెట్లు కొనమని పంపించాను అని కోడలి పాత్రలో ఉన్న వాణిశ్రీ అంటుంది. అయితే అక్కడే ఉన్న విజయనిర్మల కు ఒళ్ళు మండిపోయింది. అయితే అక్కినేని దేవదాసు చిత్రాన్ని ప్రస్తావించి,కృష్ణ దేవదాసు మూవీని కించపరిచారని భావించింది. దీనిపై కళాకారుల సంఘానికి కృష్ణ విజయనిర్మల పిర్యాదు చేయడం, క్షమాపణ చెప్పాలని అధ్యక్షుడు గుమ్మడి కోరడం,సరదాగా అన్న మాటను సీరియస్ తీసుకుంటే ఎలా అంటూ వాణిశ్రీ బదులివ్వడం వంటి పరిణామాల్లో జగ్గయ్య జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. అయినా విజయనిర్మల కు వాణిశ్రీకి కోపం పోలేదు. దాంతో ఇక కృష్ణ ,వాణిశ్రీ కల్సి నటించలేదు.

