Movies

టాప్ హీరోస్ దెబ్బతిన్న కాలం…ఎవరికి ఎన్ని ప్లాప్స్ వచ్చాయో ?

అగ్ర హీరోలు చేసే కొన్ని సినిమాలు టాప్ రేంజ్ కి వెళ్తాయి. మంచి ఆదరణ పొందుతాయి. అయితే జనం అదే మూడ్ లో ఉంటారు. మరో సినిమా చేస్తే ఆ రేంజ్ లో లేదని నిరాశ చెందుతారు. ట్రెండ్ మార్చడం కొంచెం కష్టం అవుతుంది. దాంతో కొన్ని సినిమాలు ప్లాప్ అవుతాయి. నటరత్న ఎన్టీఆర్ నటించిన లవకుశ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని నమోదుచేసింది. శ్రీరాముడు గెటప్ లో అదిరిపోవడంతో స్టార్ ఇమేజ్ దేవుడు ఇమేజ్ గా మారింది. ఆతర్వాత ఎన్టీఆర్ సినిమాలు చాలా వచ్చినా హిట్స్ అవుతున్నాయి. కానీ పెదేళ్లపాటు బ్లాక్ బస్టర్ రాలేదు. 1973లో దేవుడు చేసిన మనుషులు సినిమాయే సూపర్ హిట్ అయింది. 1977లో దానవీర సూర కర్ణ, అడవి రాముడు వంటి మూవీస్ తో మళ్ళీ లవకుశ లాంటి హిట్ అందుకున్నారు.

ఇక అన్ని రకాల పాత్రలతో అలరించే అక్కినేని నాగేశ్వరరావు కి ఎప్పుడూ దెబ్బ తగలలేదు కానీ, ప్రేమాభిషేకం తర్వాత అలాంటి హిట్ మళ్ళీ దక్కలేదు. సూపర్ స్టార్ కృష్ణ 1974లో అల్లూరి సీతారామరాజు సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే 1976వరకూ రిలీజైన 17సినిమాలపై అల్లూరి సీతారామరాజు ప్రభావం పడింది. 1976లో పాడిపంటలు మూవీతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. 1975లో సెన్షేషనల్ హిట్ కొట్టిన సోగ్గాడు మూవీ తర్వాత 1978వరకూ సూపర్ హిట్ రాలేదు. తర్వాత మల్లెపూవు, కార్తీక దీపం లాంటి సినిమాలతో నిలదొక్కుకున్నాడు. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న తర్వాత రెండేళ్ల వరకూ హిట్ రాలేదు. 11సినిమాలు చేసినా ప్లాప్ ,ఏవరేజ్ అయ్యాయి. తాండ్ర పాపారాయుడు మూవీతో మళ్ళీ సూపర్ హిట్ కొట్టాడు. 1992లో ఘరానా మొగుడు విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్ట్రగుల్ చూసాడు. ముఠా మేస్త్రి,అల్లుడా మజాకా వంటి మూవీ వచ్చినా రేంజ్ కి తగ్గవి కాదు. 1997లో హిట్లర్ మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ఇక నందమూరి బాలకృష్ణ 2001లో నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ తర్వాత చెన్నకేశవరెడ్డి, లక్ష్మి నరసింహ లాంటి మూవీస్ వచ్చినా అంతగా విజయం కాలేదు. 2010లో సింహా మూవీతో సత్తా చాటాడు. 1989లో ట్రెండ్ సెట్టర్ శివతో సంచలన విజయాన్ని అందుకున్న నాగార్జున 1992లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం మూవీతో గాడిన పడ్డాడు. మధ్యలో కిల్లర్ లాంటి మూవీస్ వచ్చిన ఆశించిన రేంజ్ లో లేవు. 1992లో చంటి మూవీ తర్వాత విక్టరీ వెంకటేష్ కి బాడ్ టైం నడిచింది. సుందరకాండ హిట్ అయినా తర్వాత హిట్ దక్కలేదు. 1996లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీతో మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ అలాంటి ఛాన్స్ రాలేదు.హీరో రాజశేఖర్ కి 1994లో అన్న తర్వాత హిట్ రాలేదు. 1998లో సూర్యుడు,శివయ్య దాకా హిట్ చూడలేదు.

1993లో బావ బావమరిది బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ రాలేదు. 1996లో నాయుడుగారి కుటుంబం మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అనూహ్య ఇమేజ్ ఏర్పడింది. దాంతో ఆ రేంజ్ లో మూవీ రాలేదు. మళ్ళీ2008లో జల్సాతో ఊరటనిచ్చినా ,2012లో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఖుషీ రోజులను గుర్తుకి తెచ్చింది. 2006లో పోకిరి హిట్ తర్వాత సరైన మూవీ రాలేదు.2011లో దూకుడు హిట్ తో అదరగొట్టాడు. 2003లో సింహాద్రి గా బ్లాక్ బస్టర్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ కి సాంబ,అశోక్ ఒక మాదిరిగా నిలిసే, రాఖి హిట్ అయింది. అయితే 2007లో యమదొంగ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఛత్రపతి విజయంతో హై రేంజ్ కి చేరిన ప్రభాస్, 2010లో డార్లింగ్ తో గాడిన పడ్డాడు. బన్నీ,చెర్రీలకు స్ట్రగుల్స్ వచ్చినా ఎక్కువ కాలం నిలవలేదు.