Movies

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ఈ నమ్మలేని నిజాలు మీ కోసమే

బాలసుబ్రమణ్యం నెల్లూరు జిల్లాలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1946 సంవత్సరంలో జూన్ 4న జన్మించారు బాలు తండ్రి సాంబమూర్తి హరికథా పండితుడు తల్లి శకుంతలమ్మ. ముగ్గురు అన్నదమ్ములు ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబంలో బాలు రెండవ కుమారుడిగా జన్మించారు చిన్నతనము నుండి బాలుకు పాటలు అంటే చాలా ఇష్టం. అయితే తండ్రికి బాలు ఇంజనీర్ కావాలనే ఆశ ఉండేది. అందుకే మద్రాసులో AMIE కోర్సు లో జాయిన్ అయ్యాడు బాలు.అలా చదువుకుంటూనే వివిధ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు సంపాదించేవాడు. ఆ సమయంలోనే సినీ రంగ ప్రవేశం చేశారు. 1966వ సంవత్సరంలో నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమా తో గాయకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు ఈ సినిమాకి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. బాలు తన మొదటి సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన కోదండపాణి గారి మీద అభిమానంతో తన స్టూడియోకి కోదండపాణి ఆడియో లాబ్ అని పేరు పెట్టుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల కు వారసుడిగా నిలిచారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.గాయకుడిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు డబ్బింగ్ ఆర్టిస్టుగా మరియు నటుడిగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు.

1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ల పంట సినిమాలో మొదటి సారిగా నటుడిగా కనిపించారు 1990లో ఓ పాపా లాలి సినిమాలో హీరోగా నటించారు. మన్మధలీల సినిమాతో పాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారారు. ఈ సినిమాలో కమల్ హాసన్ కి డబ్బింగ్ చెప్పారు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ సల్మాన్ ఖాన్ భాగ్యరాజ్ మోహన్ విష్ణువర్ధన్ అర్జున్ కార్తీక్ రఘువరన్ వంటి అనేక మందికి పలు భాషల్లో గాత్రదానం చేశారు.ముఖ్యంగా కమలహాసన్ పది పాత్రలు పోషించిన దశావతారం సినిమాలో కమలహాసన్ కి ఏడు పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరపై కూడా తన స్టామినా చూపించారు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకువచ్చారు. 1996లో ప్రారంభమైన పాడుతా తీయగా కార్యక్రమం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బాలు భార్య పేరు సావిత్రి. కూతురు పల్లవి కొడుకు చరణ్. చరణ్ సినిమాల్లో పాటలు పాడేవాడు అలాగే నిర్మాతగా కూడా సినిమాలు తీశాడు. బాలు సోదరి ఎస్.పి.శైలజ కూడా గాయని.

2020 ఆగస్టు నెలలో కోవిడ్-19 వ్యాధి సోకగా ఆసుపత్రిలో చేరాడు. ఆగస్టు 5 2020 న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆతరువాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలతో అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు 2020 సెప్టెంబరు నెల 25 వ తేదిన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మరణించాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."