వారసులు సరే, వాళ్ళ సోదరుల సంగతేంటి… ఎంత ప్రయత్నం చేసిన…?
ఇప్పటికే సినిమా రంగంలో వారసత్వం ఫుల్లుగా ఉంది. అయితే అదృష్టం,నటన, టాలెంట్ అన్నీ కల్సి వస్తేనే ఎవరైనా నిలదొక్కుకుంటారు. హీరోల కొడుకులు చాలామంది వచ్చినా కొందరు వెనక్కి వెళ్లిపోయారు. అయితే స్టార్ ల సోదరులు కూడా ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో హీరో శ్రీకాంత్ సోదరుడు హీరోగా ప్రయత్నించినా రాణించలేదు. అలాగే రవితేజ తమ్ముళ్లు చిన్న వేషాలు వేస్తూనే హీరోలుగా ట్రై చేసి చతికిలబడ్డారు. అయితే అల్లు అర్జున్ బ్రదర్ శిరీష్, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ , నాగచైతన్య సోదరుడు అఖిల్ , బెల్లంకొండ శ్రీను తమ్ముడు సాయి ఇలా సోదరులంతా పట్టుదల, కృషి, అండదండలు ఉన్నప్పటికీ ఇంకా పరిస్థితి ఇంకా లైన్ లోకి రావడంలేదు.
ఇందులో ఇతర వ్యాపకాలు చూసుకుంటూనే అల్లు శిరీష్ హీరోగా రాణించేందుకు తీవ్ర కృషి చేస్తున్నాడు. అయితే సరైన బ్లాక్ బస్టర్ హిట్టు పడక ముందుడగు పడడంలేదు. అయినా కృషి ఆపకుండా హిట్ కోసం చూస్తున్నాడు. అక్కినేని వారసుడు నాగచైతన్య సోదరుడు అఖిల్ ఇప్పటికే మూడు మూవీ చేసినా హిట్ దక్కలేదు. తాజాగా నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పక్కాగా తీస్తున్నారని టాక్. మరి ఇది ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ఇక సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ … ఉప్పెన మూవీ చేసాడు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. రిలీజ్ తర్వాత ఏమౌతుందో చూడాలి. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తమ్ముడు మనోజ్ హిట్స్ రాకపోవడంతో కొన్నాళ్ళు ఆగాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త మూవీతో సత్తా చాటాలనే భావనతో వస్తున్నాడు.
అంతేకాదు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ కూడా ఓ సినిమా చేసి, హీరోగా ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంకా ధీమాతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లకొండ శ్రీను ఇండస్ట్రీలో బాగానే సెటిల్ అయ్యాడు. అతడి తమ్ముడు సాయి కూడా సినిమాల్లోకి వచ్చాడు. షూటింగ్ మొదలై ఆగిపోవడంతో మరో సినిమాకోసం చూస్తున్నాడట. ,పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి వరుసకు సోదరుడైన సిద్ధార్థ్ రాజ్ కుమార్ కొన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ కనిపించలేదు. హీరోలే కాదు,హీరోయిన్స్ కూడా తమ సోదరులను తెరమీదికి తెస్తున్నారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ తన సొంత తమ్ముడిని ఇండస్ట్రీకి తేవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది.

