అన్నయ్య 5 సినిమాలు లైన్ లో పెట్టాడు…మరి తమ్ముడు పరిస్థితి ఏమిటో ?

అక్కినేని నట వారసత్వంలో మూడు తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తండ్రి నాగార్జున బాటలో ముందుకు దూసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే పలు విజయవంతమైన మూవీస్ చేసిన చైతు ప్రేమించి సమంతను పెళ్లి చేసుకున్నాక ఇద్దరూ బిజీ స్టార్స్ అయ్యారు. పెళ్ళికి ముందు సమంతతో నటించడమే కాదు, పెళ్లయ్యాక సమంతతో నటించిన మజిలీ మూవీ తో హిట్ అందుకున్నాడు.

అలాగే మేనమామ అయిన విక్టరీ వెంకటేష్ తో కల్సి వెంకీ మామా మూవీలో నటించి, చైతు హిట్ అందుకున్నాడు. మరోపక్క సోదరుడు అయిన అక్కినేని అఖిల్ మూడు సినిమాలు ప్లాప్ కాగా, హిట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తుంటే, ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకోడానికి నాగ చైతన్య మంచి కథలు ఎంచుకుని సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నాడు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ లవ్ స్టోరీ లో చైతు నటిస్తున్నాడు. వచ్చే డిశంబర్ ,జనవరి లలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. అలాగే శేఖర్ కమ్ములతోనే మరో సినిమా లైన్ లో పెట్టాడట. ఇప్పటికే పరశురామ్ డైరెక్షన్ లో 14రీల్స్ పతాకంపై సినిమాకోసం రంగం సిద్ధం అయింది. మరోపక్క మనం మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి దిల్ రాజు నిర్మాణంలో రంగం సిద్ధం అవుతోందని అంటున్నారు. ఇంకోపక్క వెంకీ అట్లూరి తో కల్సి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మరో సినిమాకు సిద్ధం అవుతున్నాడు.