Movies

బాలు సంపాదించిన ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే!

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ డమ్ వచ్చాక ఇక ఎదురే లేదనుకుంటూ మారిపోతుంటారు. భూమ్మీద కాళ్ళు నిలబడవు. కళ్ళు నెత్తికెక్కాయి వంటి మాటలు వింటూ ఉంటాం. కానీ అన్ని భాషల సినిమాల్లో వేలకు వేలు పాటలు పాడిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఎంతో వినయంగా వినమ్రతతో ఉండేవారు. ఎక్కడా భేషజాలకు తావివ్వకుండా ఎలాంటి వివాదాలకు తెరలేపకుండా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా తన ప్రస్థానం సాగించిన బాలు అందరి మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. దేశం గర్వించతగ్గ గాయకునిగా కీర్తి ప్రతిష్టలు సాధించారు.

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలనే తత్త్వం బాలుగారిది. అందరితో కలివిడిగా ఉంటూ ,అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. 16భాషల్లో మొత్తం 45వేలకు పైనే పాటలు పాడి రికార్డ్ క్రియేట్ చేసారు. గాయకుడిగానే కాదు,ప్రొడ్యూసర్ గా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ,సంగీత దర్శకుడిగా ఇలా అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేసిన బాలు కీర్తి ప్రతిష్టలతో పాటు కోట్లలో ఆస్తులు కూడా కూడబెట్టారు. పైగా ఏనాడూ తన రెమ్యునరేషన్ గురించి డిమాండ్ కూడా చేయలేదట.

నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మిన వ్యక్తిగా ప్రొడ్యూసర్స్ ఇచ్చింది పుచ్చుకోవడం తప్ప ఏనాడూ డిమాండ్ అన్నది లేదని అందరూ చెప్పేమాట. తన సాంగ్స్ కి రాయల్టీగా కొన్ని కోట్లు వస్తాయట. ఏడాదికి రెండు కోట్లు వస్తుందని అంచనా. దాదాపు 700కోట్ల పైనే ఆస్తి విలువ ఉంటుందని అంటున్నారు. డబ్బుతో పనిలేకుండా ఆయన కీర్తి ప్రతిష్టల విలువ ఇక లెక్క కట్టలేం. భౌతికంగా లేకుండా ఆయన పాటలు, సంగీతం స్థిరంగానే ఉంటాయి. అవే శాశ్వతం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."