Devotional

గోత్రం అంటే ఏంటి.? ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోవచ్చా.?

ప్రతి హిందువుకు గోత్రం అంటూ ఉంటుంది. గోత్రం లేని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ప్రతి కులం వారికి కూడా వారిదైన గోత్రం ఉంటుంది. ఇంతకు ఈ గోత్రం అంటే ఏంటి, ఈ గోత్ర నామం ఎక్కడ నుండి తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.. పూర్వ కాలంలో ఒక కుటుంబంకు చెందిన వారికి విద్యలను నేర్పించేందుకు గురువులు ఉండేవారు. వారి కుటుంబ గురువు పేరును గోత్రంగా మార్చుకున్నారు. కొందరు విద్యను అభ్యసించని వారు వారి పూర్వికుల పేర్లు లేదా వారి వంశం యొక్క మూల పురుషుడి పేరును గోత్రంగా తీసుకున్నారు. అలా గోత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి.

ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకునేందుకు అనర్హులు అని హిందు ధర్మ చెబుతుంది. హిందూ ధర్మ ప్రకారం ఒకే గోత్రం కలిగి ఉన్న వారు అన్నా తమ్ముడు లేదా అన్నా చెల్లి అవుతారు. రక్త సంబంధీకులు హిందు ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోవద్దు. అందుకే ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోవద్దని అంటూ ఉంటారు. ఒకే గోత్రం ఉన్న అమ్మాయి అబ్బాయి అక్కా తమ్ముడు లేదా అన్నా చెల్లి వరుసలు అవుతారు. పరిచయం లేకున్నా కూడా పూర్వంలో ఏదో ఒక చోట బంధుత్వం ఉండి ఉంటుంది. ప్రపంచంలో ఏ హిందువులకు కూడా సంబంధం లేకుండా ఒకే గోత్రం ఉండదు. గోత్రం కలిసింది అంటే సంవత్సరాల క్రితం అయినా వారికి రక్త సంబంధం ఉండి ఉంటుంది. అందుకే గోత్రాలు ఒక్కటి అయిన వారు పెళ్లి చేసుకోవద్దు.
https://www.chaipakodi.com/