Movies

లాక్ డౌన్ లో సైతం క్రేజీ బ్యూటీకి ఆఫర్స్ …ఎన్ని కోట్లో తెలుసా ?

హీరోయిన్ గా తన స్టార్ డంను పెంచుకుంటూ .. తెలుగు, తమిళంలో ప్రస్తుతం సాయి పల్లవి క్రేజీ బ్యూటీగా సత్తా చాటుతోంది. మిగిలిన హీరోయిన్స్ కి భిన్నంగా సాయిపల్లవి నటిస్తూ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలను కాకుండా కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ .. ఎప్పటికప్పుడు తన ఇమేజ్ పెంచుకొంటోంది. గ్లామర్ డాల్ గా నటించేందుకు ఒప్పుకోని సాయి పల్లవి త్వరలో నాగచైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’, అలాగే రానాతో కలిసి ‘విరాటపర్వం’ సినిమాతో ఆడియన్స్ దగ్గరకి రాబోతోంది.

ఈ రెండు సినిమాలు కాకుండా సాయి పల్లవి మరో మూడు నాలుగు సినిమాలకు కూడా కమిట్ అయింది. ఈ కరోనా కాలంలో గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో అందరూ ఢీలా పడుతున్నారు. ఇలాంటి సమయంలో సైతం ఈ ఫిదా హీరోయిన్ ఒప్పందాలు చేసుకుందని, అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న ‘వేదాళం’ అలాగే యంగ్ హీరో శర్వానంద్ తో మరో సినిమా లో కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

వాటికి సాయి పల్లవి అందుకోబోతున్న పారితోషికం దాదాపుగా రూ.8 కోట్లుగా సినీ వర్గాల లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది మొత్తం కూడా సాయి పల్లవి బిజీ బిజీగా ఉండబోతుంది. ఇంకా ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయితే ఆమె 2021 ఆదాయం పది కోట్లను మించే పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒక్క ఏడాదిలో ఇంత భారీ మొత్తాన్ని సంపాదించడం అంటే నిజంగా దక్షిణాదిలో ఓ రికార్డ్ అని అంటున్నారు. మరి తాజా ఒప్పందాల ప్రకారం రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."