Movies

పూజ వద్దు అంటున్న ఎన్టీఆర్ అభిమానులు….కారణం ఇదేనట

వెండితెరపై కొన్ని జంటలు చూడముచ్చటగా ఉంటాయి. గతంలో డజన్ల కొద్దీ సినిమాల్లో హీరో హీరోయిన్స్ కల్సి నటిస్తూ హిట్ ఫెయిర్ గా నిలిచారు. ఇప్పుడైతే ఒకటి రెండు మూవీస్ అయ్యాక హీరోయిన్ ని మార్చాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. దాంతో కొత్త హీరోయిన్స్ ని తీసుకురాలేక దర్శక నిర్మాతలు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా విన్పిస్తున్న పేరు పూజా హెగ్డే.

మొన్న సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న పూజా .. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ మూవీలో చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాగానే హిట్ అయింది. ఇపుడూ తారక్, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ సెలక్షన్ పెద్ద సమస్య గా మారిందట.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇలా అగ్ర హీరోలతో జోడీ కట్టిన పూజా కు మంచి డిమాండ్ ఉంది. అయితే ముంబయి భామ అమృత అయ్యర్ ఉన్నప్పటికీ 30రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్ మూవీస్ లో చేసేసింది. ఈమె కంటే పూజా బెటర్ అని త్రివిక్రమ్ అనుకుంటుంటే, పూజా వద్దు ఆమెను తారక్ తో చూడలేం అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ మెసేజ్ లు పెడుతున్నారట. దీంతో ఎవరిని సెలెక్ట్ చేయాలా అని తలలు పట్టుఉంటున్నారట.