Health

ఒకే ఒక టీస్పూన్ తేనెతో.. బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ టిప్స్..

ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం ‘తేనె’ ఒకటి.. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది.

తేనె లో నాలుగు రకాలు….
పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.

తేనెలోఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా…

తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్… లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు.

పంచదార లాగా కాదు తేనె. ఇది న్యాచురల్ గా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ.. ఫ్యాట్, కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడతాయి. మెటబాలిజంను పెంచుతాయి. ఒబేసిటీని అరికడతాయి.
ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేయాలి. దీన్ని ఉదయాన్నే పరకడుపున తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గినట్టు.. చాలా మంది రివ్యూ కూడా ఇచ్చారు.

ఒక టీస్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసంను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. ఈ డ్రింక్ ని ప్రతి రోజు నిద్రలేవగానే తాగితే.. ఇంటెస్టినల్ ట్రాక్ ప్యూరిఫై అయి.. ఫ్యాట్ కరిగిపోతుంది.

ఒక గ్లాసు వెచ్చటి నీటిలో ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. ఈ డ్రింక్ తాగడం వల్ల.. ఎంతో కాలం నుంచి పేరుకున్న ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది.

ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల నిమ్మరసం కలిపి.. ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఈ డ్రింక్ ని రోజులో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. ఇది హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. శరీరంలో పేరుకున్న ఫ్యాట్స్ ని తొలగిస్తుంది.

ఒక బాటిల్ నిండా నీటిని నింపి.. అందులో ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ నీటిని వ్యాయామానికి ముందు, వ్యాయామం చేసేటప్పుడు, వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవాలి. అంతే అద్భుతమైన ఫలితాలు చూస్తారు.

భోజనానికి 20 నిమిషాల ముందు.. అల్లం టీలో తేనె కలిపి తీసుకుంటే.. తేలికగా బరువు తగ్గవచ్చట. రెండు కప్పుల నీటిని మరిగించి.. అందులో కొద్దిగా అల్లం ముక్క వేయాలి. దాన్ని వడకట్టి.. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఒక టీస్పూన్ తేనె కలిపి.. తాగాలి.