దర్శకేంద్రుడి పెళ్లి సందడిలో హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసా ?
చాలా విరామం తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మెగా ఫోన్ పెట్టబోతున్నారు. ఇటీవల తన ట్విట్టర్ ద్వారా పెళ్ళిసందడి మళ్ళీ మొదలు అంటూ చెప్పడంతో దర్శకేంద్రుడి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త చిత్రంతో రావడానికి రాఘవేంద్రరావు సీరియస్ ట్రయల్స్ లో ఉన్నారని టాక్. అంతేకాదు, అప్పట్లో హీరో శ్రీకాంత్ కి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చిన పెళ్లి సందడి పేరుతోనే మూవీ చేయాలనుకోవడం విశేషం.
అయితే శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ ఇంట్లో నుంచే హీరో గా రాబోతున్నట్లు టాక్. శ్రీకాంత్ కొడుకు రోషన్ నిర్మలా కాన్వెంట్ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో గ్యాప్ తర్వాత రోషన్ ని హీరోగా రీలాంచ్ చేయడానికి దర్శకేంద్రుడు సిద్ధమయ్యారని టాక్ వైరల్ అవుతోంది.
హీరోగా రోషన్ ని తీసుకుంటే, మరి అతడి కి జోడీగా ఎవరు చేస్తారబ్బా అని రకరకాల పేర్లు వచ్చేస్తున్నాయి. అయితే అతడి స్మార్ట్ లుక్ కి సరిపడే హీరోయిన్ ఫిక్సయ్యిందని కూడా వినిపిస్తోంది. సీనియర్ హీరోయిన్ శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకుంటారని టాక్. దర్శకేంద్రుడి డైరెక్షన్ లో శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి గ్లామర్ హీరోయిన్ గా నిల్చింది. మళ్ళీ ఇప్పుడు శ్రీదేవిని కుమార్తెను కూడా లాంచ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పటికే ఖుషిని సంప్రదించినట్లు టాక్.

