Movies

నవదీప్, యాంకర్ రవి ఆ షో నుండి బయటకు రావటానికి కారణం అదేనా ?

జబర్దస్త్ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటకు వచ్చి అలాంటి కామెడీ షో అదిరింది పేరిట ఒక షో జి తెలుగులో చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ షోలో నవదీప్, యాంకర్ రవి కూడా ఇన్నాళ్లూ పనిచేసారు. ఎన్ని హంగులు పెట్టినా జబర్దస్త్ ని అధిగమించడంలో అదిరింది షో వెనుకబడిందని, టిఆర్పి రేటింగ్ కూడా తక్కువగానే ఉందని టాక్ వచ్చింది. ఇక ఈ షోలో ఎపి సీఎం వైఎస్ జగన్ ని ఇమిటేట్ చేస్తూ స్కిట్ కూడా వివాదం అయిందని అంటున్నారు.

తాజాగా ఈ షో పేరును బొమ్మ అదిరింది పేరిట మార్చడమే కాదు, యాంకర్ శ్రీముఖి, సుమ కనకాల, జానీ మాస్టారు ఇలా కొత్తవాళ్లతో సందడి చేస్తున్నారు. నవదీప్ ని పట్టుబట్టి నాగబాబు తీసుకొచ్చాడని, ఇప్పుడు బయటకు వచ్చేయడం వెనుక కూడా నాగబాబు హ్యాండ్ ఉందా లేక యాజమాన్యంతో విబేధాలు కారణమా అనేది తెలీడం లేదు. యాంకర్ రవి, భానుశ్రీలను తొలగించి శ్రీముఖిని తీసుకున్నారని షో తీరు తెలియజేస్తోంది. అలాగే జడ్జి ప్లేస్ లో ఉన్న నవదీప్ ని తీసేసి జానీ మాస్టర్ ని తీసుకున్నారు.

అయితే కొత్తగా వస్తున్న జబర్దస్త్ లో నవదీప్ దర్శనమిస్తున్నాడు. ఇది చూస్తుంటే, షో మారడం వెనుక చాలా తతంగం జరిగి ఉంటుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇక యాంకర్ రవి కూడా అదే షోలో కన్పిస్తున్నాడట. అంతేకాదు దసరా స్పెషల్ సందర్బంగా ఎవరే అతగాడు షోలో యాంకర్ రవి రచ్చరచ్చ చేస్తున్నాడు. ఈటివి దసరా సందర్బంగా ప్రసారం చేయనున్న ఈ షోలో నవదీప్ కూడా నవ్వుతూ కనిపిస్తున్నాడు. మొత్తానికి ఎక్కడో తేడా కొట్టిందని అందుకే బొమ్మ అదిరింది నుంచి బయటకు వచ్చారని టాక్.