రౌడీ స్టార్ తమ్ముడి మూవీకి గిట్టుబాటు బాగుందా….నమ్మొచ్చా ?
కరోనా ఎఫెక్ట్ తో సినిమా ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతింది. షూటింగ్స్ ఎక్కడివి అక్కడ ఆగిపోవడం, థియేటర్లు మూతబడడంతో ఓటిటి వేదికగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ ఎప్పుడో తెలీని పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫారం సినిమాల పాలిట వరమైంది. వచ్చినకాడికి సొమ్ము చేసుకోడానికి వీలుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం బాగానే ఉందని అంటున్నారు. అందుకే ఇప్పటివరకూ 47డేస్ , ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, వి , నిశ్శబ్దం వంటి సినిమాలన్నీ ఓటిటిలో రిలీజ్ అయ్యాయి.
ఇందులో బాగానే వర్కవుట్ అవుతున్న నేపథ్యంలో కొందరు ఇటు మొగ్గుతున్నారు. ఒరేయ్ బుజ్జి, ఆకాశమే నీ హద్దురా లాంటి మూవీస్ కూడా ఓటిటిలో వచ్చాయి. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ కూడా ఓటిటి లో రాబోతోంది. దీన్ని ఇప్పటికే ప్రయిమ్ లో నాలుగు కోట్లకు కొన్నట్లు టాక్. ప్రస్తుత తరుణంలో అన్ని రకాల మూవీస్ పై దృష్టి పెట్టాలని ఓటిటి వేదికల వాళ్ళు అనుకోవడం వలన ఇలా మంచి రేటు పలుకుతోందని టాక్.
నిజానికి విజయ్ దేవరకొండ మాదిరిగా డైలాగ్ డెలివరీ తప్ప ఆనంద్ దేవరకొండలో పెద్దగా తేడా ఏమీ లేదని గతంలో వచ్చిన దొరసాని మూవీ తేల్చేసింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ లో కొంచెం జాగ్రత్తపడి , డిఫరెంట్ గా ఆనంద్ నటించాడని అంటున్నారు. చూసి చూడంగానే, జాను మూవీస్ లో నటించిన వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ తెస్తుందో చూడాలి.

