గంగవ్వ ఎలిమినేట్ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా ?

కింగ్ నాగార్జున హీరోగా స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో దూసుకెళ్తోంది. 16మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షోలో ఒక్కొక్కరు ఎలిమినేషన్ అవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం అనుకోకుండా తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. నిజానికి అనారోగ్య కారణాల వలన ఎలిమినేషన్ అయింది కానీ ఈమెకు వీర లెవెల్లో ఫాలోయింగ్ ఉంది. అసలు ఈ షోలోకి ఎంటర్‌ అవ్వడమే ఓ మిరాకిల్. ఇక ఇల్లు కట్టుకోవాలన్న కోరిక కూడా ఆమెకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ ద్వారా తీరిందన్న టాక్.

హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినపుడు తన కష్టాలు చెప్పుకుని అందరిని ఏడిపించేసిన గంగవ్వ పల్లెటూరి అమాయకత్వం, లోకాన్ని చదివిన అనుభవం, ముఖ్యంగా తెలంగాణ యాస అన్నీ వరమయ్యాయి నిజానికి టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరు. మై విలేజ్‌ షో తో ఫేమస్‌ అయిన గంగవ్వ నేషనల్‌ మీడియా దృష్టిలో కూడా పడింది. అయితే 60ఏళ్ళు దాటిన ఈమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు రావడాన్ని చాలామంది తప్పుబట్టారు. అయితే ఐదు వారాలకు అగ్రిమెంట్ రాయించుకున్నందున అది అయ్యాక బయటకు వెళ్తుందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అదే ఇప్పుడు నిజమైంది.

నిజానికి హౌస్ లోంచి వెళ్లిపోతానని కూడా గతంలోనే గంగవ్వ కన్నీళ్లు పెట్టుకోవడం చాలామంది ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. అప్పుడు కూడా ట్రోల్స్ పడ్డాయి. అప్పుడు పంపించకుండా ఇప్పుడు పంపడం వెనుక కారణం ఏమిటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈమె ఉండడం వలన మిగిలిన కంటెస్టెంట్స్ నష్టపోతున్నారని కూడా కొందరు వ్యాఖ్యానాలు చేసారు. కొందరు మాత్రం గంగవ్వ నామినేట్ కాకుండా జాగ్రత్త వహిస్తున్నారట. అయితే గ్రామీణ ప్రాంత వాసులు, అందునా తెలంగాణా వాళ్ళు ఎక్కువమంది బిగ్ బాస్ షో చూసేలా చేయడం కోసమే గంగవ్వను అగ్రిమెంట్ ప్రకారం తీసుకొచ్చి, అగ్రిమెంట్ అయ్యాక ఎలిమినేషన్ చేసారని విమర్శలు వస్తున్నాయి.