బాలు గారి చివరి పాట రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
చిన్న జ్వరమే .. హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చేస్తా. .. మీరంతా ధైర్యంగా ఉండండి ..’అంటూ మెసేజ్ పెట్టి కరోనాతో హాస్పిటల్ కి వెళ్లి, కరోనా తగ్గినా సరే, ఆరోగ్యం తిరగబెట్టి వేరేలోకానికి వెళ్లిపోయారు ఎస్పీ బాలు. వేలాది పాటలతో అన్ని భాషా చిత్రాల్లో అభిమానులను సొంతం చేసుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలు ఇకలేరన్న వార్తను అభిమానులెవ్వరూ జీర్ణించుకోలేదు. ఇక నా పని అయిపొయింది ,ఇచ్చినపని చేసేసాను వెళ్లిపోతున్నా అంటూ అటు నుంచి అటే ఈలోకం వీడి వెళ్లిపోయారు. దివినుంచి కోట్లమంది అభిమానులను చూస్తూనే ఉన్నారు.
తన గానామృతంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న బాలు వ్యక్తిగా ఎందరినో ఆదరించారు. అందుకే ఆయనతో గల అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో రోజుకో వార్త ఆయన గురించి వస్తూనే ఉంది. బాలుతో గల అనుబంధాన్ని సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ షేర్ చేసుకుంటూ,.. చిన్నప్పటినుంచి బాలు పాటలు వింటూ పెరిగానని,బాలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఉన్నానంటే అందుకు బాలు ఇచ్చిన స్ఫూర్తే కారణమని చెప్పారు. ఎంతోమందిని ఎంకరేజ్ చేసిన బాలు తనను కూడా ప్రోత్సహించారని తెలిపారు.
ఎస్పీ బాలు కి డబ్బుమీద వ్యామోహం లేదు. లెజెండరీ సింగర్ అయివుండి కూడా డబ్బులు డిమాండ్ చేసేవారు కాదు. ఇందుకు ఈ ఘటన ఉదాహరణ. రవివర్మ సంగీత దర్శకత్వం వహించిన చీమ ప్రేమ మధ్యలో భామ మూవీ లో ఓ సాంగ్ పాడించుకున్నారు. పాటకోసమే రెమ్యునరేషన్ గురించి రవివర్మ అడిగారట. ట్రాక్ పంపించి, మేనేజర్ తో మాట్లాడండి అని బాలు బదులిచ్చారట. దాంతో మేనేజర్ కి ట్రాక్ పంపించి ఎమౌంట్ గురించి అడిగితె, …’నాకు చెప్పారండి , మీదగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. ఒకవేళ మీరు ఎంత ఇస్తే అంతేతీసుకోమన్నారు ‘ అని మేనేజర్ చెప్పారట. నా గురించి పెద్దగా తెలీదు, ఆయనతో కూర్చుని మాట్లాడుకున్న ఘటనలు కూడా లేవు. అయినా సరే నాపట్ల బాలు గారు ఇలా అభిమానంగా వ్యవహరించడం మరిచిపోలేను ‘ అని రవివర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.

