Movies

హీరో సత్యదేవ్ రియల్ లైఫ్ లో జరిగిన నమ్మలేని నిజాలు

బాహుబలి నిర్మాతలు తీసిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మూవీని కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఓటిటి లో రిలీజ్ చేయడం, మంచి స్పందన రావడం తెల్సిందే. గొడవలంటే భయపడే మధ్యతరగతి వ్యక్తిగా హీరో సత్యదేవ్ బాగా నటించాడు. అదే సమయంలో ఆవేశం వస్తే ఎలా ఉంటాడో కూడా చెలరేగిపోయి ఉగ్ర రూపం చూపించాడు. వైజాగ్ లో పుట్టి పెరిగిన సత్యదేవ్ చిన్నపుడు చిరంజీవి పాటలు పెడితేగానీ అన్నం ముట్టేవాడు కాదట. అలా చిన్నప్పటి నుంచి సినిమా లంటే ఇష్టం. వైజాగ్ లో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసి ,కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేసాడు.

సినిమాల్లో ఛాన్స్ కష్టమని తెల్సి, హైదరాబాద్ ఐబీఎం లో సత్యదేవ్ ఉద్యోగం చేస్తూనే, సినిమా ట్రయల్స్ మొదలు పెట్టాడు. రాత్రి జాబ్, పగలు సినిమా ఆఫీసులు చుట్టి రావడం ఇదే పని. బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయితే , ఆడిషన్స్ కి వీకెండ్స్ లో వచ్చేవాడు. మొత్తానికి ఓ ఫ్రెండ్ ద్వారా మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఛాన్స్ కొట్టేసాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో మహేష్ బాబు ఫ్రెండ్ గా చేసిన సత్యదేవ్ అత్తారింటికి దారేది మూవీలో కొన్ని సెకన్స్ కనిపించే పాత్ర చేసాడు. ముకుంద, అసుర మూవీస్ లో నెగెటివ్ రోల్స్ వేసాడు. హీరోగా మారే ప్రయత్నం చేయమని అసుర షూటింగ్ లో రవివర్మ చెప్పాడు.

దాంతో హీరోగా ట్రయిల్ మొదలు పెట్టడం, పూరి జగన్నాధ్ నుంచి ఫోన్ రావడం, ఆడిషన్స్ లో సెలక్ట్ కావడం, జ్యోతిలక్ష్మి మూవీలో హీరో ఛాన్స్ . రాత్రి ఉద్యోగం, పగలు షూటింగ్ , శని ఆదివారాల్లో ఫుల్లుగా షూటింగ్. రోజుకి రెండు గంటలే నిద్ర. బ్లఫ్ మాస్టర్ వరకూ సినిమాల్లో నటిస్తూనే ఆరేళ్ళు ఉద్యోగం కొనసాగించాడు. జ్యోతిలక్ష్మి తర్వాత ప్రకాష్ రాజ్ తీసిన మన ఊరి రామాయణం మూవీలో ఛాన్సిచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ లో సత్యదేవ్ కి పూరి ఛాన్స్ ఇచ్చాడు. ఇక 47డేస్ , ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. మలయాళం మూవీకి రీమేక్ గా వచ్చిన ఉమా మహేశ్వర మూవీ 2016లోనే చేయాలి. కానీ ప్రొడ్యూసర్ లేకపోవడంతో కేరాఫ్ కంచరపాలెం హిట్ తో డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ మూవీ రీమేక్ చేయాలనుకోవడం, సత్యదేవ్ ఆశ్చర్యంగా చూడడం, మొత్తానికి బాహుబలి నిర్మాతలే దీన్ని నిర్మించడం జరిగిపోయాయి. ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి.