Movies

రోజా గ్లామ‌ర్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటో తెలుసా ?

సినిమాల్లో రోజాకు నేటి రోజాకు తేడా గ‌మ‌నిస్తే ఆమె కాస్త లావు అయినా కూడా రోజా చలాకీ తనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. టీవీల్లో ఆమె చలాకీ తనం అందరికీ తెలిసిందే. అయితే ఈటీవీలో ప్రసార‌మ‌వుతున్న బుల్లితెర పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్ షోలో గ‌త రెండు మూడు ఎపిసోడ్‌లు చూస్తే రోజా బాగా స‌న్న‌బ‌డిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. గతంతో పోలిస్తే రోజా కాస్త సన్నబడ్డట్లు గమనిస్తున్నారు. రోజా ఒక్క‌సారిగా ఇలా స‌న్న‌బ‌డ‌డం వెన‌క ర‌క‌ర‌కాల కామెంట్లు విన‌వ‌స్తున్నాయి.

ఇలా నాజూగ్గా కనపడేందుకు రోజా… యోగా, వ్యాయామం లాంటి స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తులు అవ‌లంభిస్తున్నారా? లేదా ఆమె శ‌స్త్ర‌చికిత్స‌ల ద్వారా లావు తగ్గారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. రోజా లావు తగ్గించుకునే శస్త్ర చికిత్స చేయించుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే, మార్గం ఏదైనా ఒకప్పటి హీరోయిన్ రోజా మరింత గ్లామరస్ గా తయారయ్యారు కాబట్టి, ఇండస్ట్రీ జనాలు మళ్లీ అమ్మ, వదిన పాత్రలను రోజాకు ఆఫర్ చేస్తారేమో? చూడాలి. రోజా ఇప్ప‌టికే ఈ త‌ర‌హా పాత్ర‌లు కూడా చేసిన సంగ‌తి తెలిసిందే.