సర్కారువారి పాటలో భారీగా మార్పులు…మార్పులకు కారణం ఆమేనా ?
sarkaru vaari paata Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా సెట్స్ మీదికి రాబోతున్న ”సర్కారు వారి పాట” మూవీపై ఇప్పటినుంచే భారీ అంచనాలున్నాయి. నిజానికి గత మే నెలలో అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ కరోనా లాక్ డౌన్ కారణంగా సెట్స్ మీదకు రాలేదు. ప్రస్తుతం ఒక్కొక్క షూటింగ్ మొదలవ్వడంతో ఈ మూవీ జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”సర్కారు వారి పాట”కు పరశురామ్ దర్శకత్వం చేస్తున్నాడు.
‘మహానటి’ తో ఫేమస్ గా మారిన కీర్తి సురేష్ ఈ మూవీలో మహేష్ సరసన నటించబోతోంది. ప్రస్తుతం ఫ్యామిలీ తో కల్సి మహేష్ టూర్ వెళ్ళాడు. వచ్చాక ఈ సినిమా పై దృష్టి పెడతాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ మూవీ నిర్మించనున్నాయి. సంగీతం అందించనున్న థమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించారు. ముందుగా ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో ఎక్కువ భాగం షూట్ చేసేలా ప్లాన్ మార్చరట.
ప్లాన్ మారడంతో ఇక ఈ సినిమా సెకాండ్ ఆఫ్ లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్, క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ మాసీ లుక్ లో దర్శనమిచ్చాడు. సందేశాత్మక అంశాలతో పాటు వినోదం మేళవింపుగా తీయనున్న ‘సర్కారు వారి పాట’ మహేష్ ఫాన్స్ అంచనాలకు తగ్గట్టు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.