Movies

బిగ్ బాస్ అభిజిత్ గురించి ఈ నమ్మలేని నిజాలు మీకోసమే

Bigg boss abhijeet :స్టార్ మా లో కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 4సీజన్ లో చేస్తున్న కంటెస్టెంట్ అభిజిత్ సినిమాల్లో కూడా మెరిశాడు. 1988లో జన్మించాడు. అభిజిత్ ఫ్యామిలీకి నిర్మాణ రంగంలో మంచి అనుభవం ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అమెరికా వెళ్లి వచ్చిన అభిజిత్ ఇపుడు బిగ్ బాస్ లో సందడి చేస్తున్నాడు.

మిర్చి లాంటి కుర్రాడు మూవీతో కూడా అలరించిన అభిజిత్ కి నాగార్జున ఫ్యామిలీతో అనుబంధం ఉంది. ఎందుకంటే, నాగ్ కొడుకు అఖిల్ కిండర్ గార్డెన్ స్కూల్లో అభిజిత్ క్లాస్ మేట్.ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన అభిజిత్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో కొత్త తారల కోసం ప్రయత్నం చేస్తుంటే, సోషల్ మీడియా ద్వారా ఛాన్స్ అందిపుచ్చుకున్నారు.

అదే సినిమాలో అభిజిత్ కి తల్లి పాత్ర అమల వేసింది. అభిజిత్ పూర్వికులు చార్మినార్ నిర్మాణంలో భాగం పంచుకున్నారట. చార్మినార్ గోడల కోసం కోడిగుడ్లు పగులగొట్టి గట్టితనం కోసం అందులో కలిపారట. అలా వలస వచ్చిన అభిజిత్ పూర్వీకుల బాటలోనే ఆయన తండ్రి నిర్మాణ రంగంలో పేరుగాంచారు. అయితే అభిజిత్ మాత్రం సినిమాలవైపు వచ్చాడు. బిగ్ బాస్ ఇతడికి ఎలాంటి టర్న్ ఇస్తుందో వేచి చూద్దాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."