Movies

అప్పుడు నో అనకుండా ఉంటే యంగ్ హీరోని పెళ్లి చేసుకొనేదా…!

Telugu actress Priyamani :టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ మూవీలో హీరోయిన్ గా చేసి, మంచి మార్కులు కొట్టేసిన ప్రియమణి పలు సినిమాల్లో నటించి ఆడియన్స్ బాగానే దగ్గరైంది. అయితే 2017లో ముస్తాఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌లో ఛాన్స్ లు కొట్టేస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో చేయడంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా కమిట్ అయింది. కాగా అప్పట్లో హీరో తరుణ్‌ను వాళ్ల అమ్మగారు పెళ్లి చేసుకోమ్మని మాత్రం అడిగారని, అప్పుడు తాను ఓకే చెప్పుంటే ఈ రోజు తరుణ్ భార్య అయిపోయేదాన్ని అని ప్రియమణి గుర్తుచేసుకుంది.

ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ కి కేరాఫ్ ఎడ్రెస్ గా హీరో తరుణ్ ఉండేవాడు. బాలనటుడిగానే ఎన్నో హిట్ మూవీస్ చేసాడు. ఇక నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరస విజయాలు సొంతం చేసుకుని తక్కువ కాలంలోనే స్టార్ హీరో హోదా అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపులతో పూర్తిగా కనిపించకుండా పోయాడు. అయితే తరుణ్ కెరీర్‌లో ప్రేమాయణాలు ఎక్కువే అని అంటారు. అప్పట్లో ఈయన ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఆర్తి అగర్వాల్ కూడా తరుణ్ ని పెళ్ళి చేసుకోవాలనుకుందని, నో చెప్పడంతో ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా వార్తలు షికారు చేసాయి.

ఇక ప్రియమణితో కల్సి నవవసంతం సినిమాలో తరుణ్ నటించడమే కాకుండా ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు టాక్ నడిచింది. ఇద్దరూ పార్టీలకు వెళ్లారు.. అప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరూ కనిపించేవారు. అది చూసి తరుణ్ అమ్మ రోజా రమణి ఒకరోజు సెట్స్‌కు వచ్చి మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు. పెళ్లి చేస్తానంటూ ఆఫర్ చేసినట్లు, అప్పట్లో తమ ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి తరుణ్ వాళ్ల అమ్మ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని, కానీ తరుణ్ వాళ్ల అమ్మ అలా చెప్పగానే మీరు అపార్థం చేసుకున్నారని చెప్పినట్లు కూడా ప్రియమణే స్వయంగా చెప్పింది. ఆతర్వాత కూడా పెళ్ళికి అడిగినట్లు చెప్పింది.