Health

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా… ఈ విషయాలు తప్పనిసరి

Health Insurance :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి భీమా ఉండాల్సిన అవసరం ఉంది భీమా ఎంతగానో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో అనేక రకాల వ్యాధులు రావడంతో హాస్పిటల్ కి వెళితే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తోంది. కేవలం జీవిత బీమా మాత్రమే కాకుండా హెల్త్ పాలసీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వైద్యం ఖర్చు కూడా చాలా ఎక్కువ అవటంతో సామాన్యునికి భారంగా మారుతుంది.

మన కుటుంబ సభ్యులు లేదా మనకి ఏదైనా తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు లేదా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు హెల్త్ పాలసీ మాత్రమే ఆదుకుంటుంది చేతిలో డబ్బు లేనప్పుడు వైద్యం కోసం హెల్త్ పాలసీ ఆదుకుంటుంది. అలాంటి హెల్త్ పాలసీ తీసుకునే విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు. హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి.

హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు ఎంత కవరేజి చేస్తున్నాము అనే విషయం మీద పూర్తిగా అవగాహన ఉండాలి ప్రీమియం తక్కువ కదా అని కంగారుపడి తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలను తీసుకోకూడదు. అలాగే మీ వైద్య ఖర్చులకు సరిపోతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. పాలసీ తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సంఖ్య అలాగే వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. హెల్త్ పాలసీ చేసినప్పుడు ఆ తర్వాత వాటిని టాప్ అప్ ప్లాన్ ద్వారా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.