Healthhealth tips in telugu

Honey:రోజు తేనె వాడుతున్నారా… ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే

Honey weight loss :ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి తేనెను ఎక్కువగా వాడుతున్నారు. ఇంచుమించు ప్రతిరోజు తేనె ఉపయోగిస్తున్నారు తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అవి మన ఆరోగ్యానికి సహాయపడతాయ.

ఆర్గానిక్ తేనె దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. దాంతో మార్కెట్లో దొరికే తేనెను చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి తేనే స్వచ్ఛమైన దా కాదా అనే సందేహం ఉంటుంది. తేనెను కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుని కొనాలి.

స్వచ్ఛమైన తేనె అంటే ఆర్గానిక్ తేనె ఎంత కాలం అయినా చెడిపోదు ఎందుకంటే తేనెలో క్రిమిసంహారక లక్షణం ఉంటుంది అలాగే నీటి శాతం తక్కువగా ఉంటుంది అందువల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తేనె ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. మార్కెట్ లో తేనె కొనేటప్పుడు కల్తీ అయిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకుని కొంటే మంచిది.

తేనె పంచదారకన్నా రెండురెట్లు తీపిగా ఘాటుగా ఉంటుంది. అందుకే తేనెలో ఎలాంటి బాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు ఉండవు. తేనే నిజమైనది అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఒక స్పూన్ తేనెను తీసుకొని నీటిలో వెయ్యాలి. అది త్వరగా కరిగిపోతే మంచి తేనే కాదు. ఒరిజినల్ తేనే నీటిలో ఆలస్యంగా కరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.