MoviesTollywood news in telugu

పెళ్లి అయ్యాక నిహారిక తన పెళ్లి చీరని ఏమి చేసిందో తెలుసా?

Niharika wedding saree :మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక మూడు రోజులే జరిగినా, రోజూ ఎక్కడో అక్కడ ఈ పెళ్లి గురించే వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ లోని ఉదయ్ ప్యాలస్ లో జరిగిన పెళ్లి వేడుకలో మెగా హీరోలంతా సందడి చేసారు. పెళ్లి కూతురుని చేయడం దగ్గర నుంచి ప్రతి ఘట్టం చర్చకు దారితీసింది. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబంలోని పెళ్లి కావడంతో సినిమా వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ నడిచింది.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, తదితరులంతా మూడు రోజుల ముందే ఉదయ పూర్ చేరుకోగా, పెళ్లినాడు ఉదయం తన కొడుకు అకిరా నందన్ తో కల్సి పవన్ కళ్యాణ్ వచ్చాడు. విలువైన గిఫ్ట్ లు కూడా ఆమెకు ఇచ్చారు. వీటి విలువ ఐదారుకోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది.

కూతురు పెళ్ళికి నాగబాబు పదికోట్లు వెచ్చించినట్లు చెబుతున్నారు. పెళ్లిదాకా ఐదు రోజుల డ్రెస్ లకు కోటి రూపాయలను ఖర్చు చేశారట. ఇక పెళ్లి చీర ఖరీదు తెలుసుకుని అందరూ షాకవుతున్నారు. బంగారు తీగలతో స్పెషల్ గా తయారు చేయించిన ఈ చీర ఖరీదు 20లక్షలట. రెండు నెలల ముందు ఆర్డర్ ఇచ్చి తయారుచేయించారట. తల్లి మాదిరిగా తాను కూడా పెళ్ళినాటి చీరను దాచినట్లు టాక్.