అభిషేకం సీరియల్ లో నటిస్తున్న దేవ్ రియల్ లైఫ్
Abhishekam serial actor dev :ఈటీవీలో ఎప్పటినుంచి నిరంతరాయంగా ప్రసారమవుతున్న అభిషేకం సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకాదరణతో నడుస్తోంది. ఇందులో నటీనటులు తమ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సుభద్రకు భర్తగా నటిస్తున్న దేవ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
మొదట్లో నెగెటివ్ రోల్ చేసిన దేవ్ ఇప్పుడు పాజిటివ్ రోల్ చేస్తూ.. ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. దేవ్ అసలు పేరు ప్రణయ్. డిసెంబర్ 4న వరంగల్ లో జన్మించాడు. ఇతడిని ఇంట్లో అందరూ చింటూ అని పిలుస్తారు. చిన్ననాటి నుంచి నటన మీద ఆసక్తి ఉండడంతో యాక్టర్ అవ్వాలని భావించాడు.
బుల్లితెరపై తన కెరీర్ స్టార్ట్ చేసిన ప్రణయ్… మహాలక్ష్మి, అభిషేకం, తూర్పు పడమర, సీరియల్స్ లో చేస్తూ వచ్చాడు. ఇతడికి మేరేజ్ అయింది. ఒక పాప కూడా ఉంది. అభిషేకం సీరియల్ లో చేస్తూనే మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అనే మూవీలో కూడా నటిస్తున్నాడు.

