MoviesTollywood news in telugu

యాంకర్ ప్రదీప్ సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే

Anchor Pradeep Monthly Income :ఒకప్పుడు సినిమాల్లో టాప్ రేంజ్ లో ఉంటేనే బాగా సంపాదించేవాళ్ళు. కానీ ఇప్పుడూ బుల్లితెర కూడా సంపాదనకు కేరాఫ్ ఎడ్రెస్ అయింది. అందుకే చాలామంది వివిధ షోస్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. అందులో ముఖ్యంగా యాంకర్స్ ని చెప్పుకోవాలి. రెండు దశాబ్దాలు దాటినా సరే, స్టార్ యాంకర్ గా సుమ కనకాల ఫీమేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఈమె బాగానే వెనకేసిందని టాక్. ఇక మేల్‌ యాంకర్స్ లో చెప్పాలంటే, ప్రదీప్ మాచిరాజు టాప్ రేంజ్ లో ఉన్నట్లు చెబుతారు. దాన్ని బట్టి సంపాదన పరంగా కూడా ప్రదీప్ మంచి రేంజ్ లోనే ఉన్నట్లు లెక్క. పైగా నెలకు 30 రోజులు బిజీగానే ఉంటాడు.

ప్రస్తుతం ఢీ, జీ సరిగమప లాంటి టాప్ షోలకు యాంకరింగ్ చేస్తున్న ప్రదీప్. జీ తెలుగులో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అంటూ షోలను నిర్మించాడు. మిగిలిన అన్ని ఛానెల్స్‌లో కూడా షోలు చేస్తున్నాడు. ప్రదీప్ నెల సంపాదన ఎంతనే అనుమానాలు సోషల్ మీడియాలో భారీగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తుంటే మాత్రం 50 లక్షలకు పైగానే ఉంటుందని టాక్. 2018లోనే నెలకు 30 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడని వార్తలొచ్చాయి. ఈ రెండేళ్లలో ప్రదీప్ రేంజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. 30 శాతం ఆదాయం పెరిగిపోయిందని అంటున్నారు.

అందుకే ఇప్పుడు 40 లక్షల వరకు ప్రదీప్ సంపాదిస్తున్నాడని, ఈయన ఒక్కో ఎపిసోడ్ కోసం 1.25 లక్షలకు పైగానే తీసుకుంటున్నాడని వినిపిస్తోంది. రెండేళ్ల కింద ఎపిసోడ్‌కు 75 వేల వరకు తీసుకున్న ప్రదీప్ ఇఫ్పుడు తన పారితోషికం మరో 50 వేలు పెంచేసాడు. ఇక లాక్ డౌన్ కి ముందు 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా కోసం 30 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. అంతేకాదు, కథలు నచ్చితే హీరోగా నటిస్తూ ఉంటానని చెప్తున్నాడు.