Devotional

చేతబడి అనేది నిజంగా ఉందా? నమ్మవచ్చా?

chetabadi telugu :జీవన విధానం ఆధునికంగా మారిన సరే కొన్ని నమ్మకాలు, చేష్టలు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చేతబడి ని చెప్పవచ్చు. అసలు ‘చేతబడి’ అనేది ఉందా? ఉంటే దాని ప్రభావం ఏమిటి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం.

చేతబడిని పూర్వ కాలంలో ఎక్కువగా నమ్మేవారు. మన అముమ్మ, మమ్మలను కదిపితే ఈ విషయాల గురించి చెప్పుతారు. అయితే ఈ మధ్య కాలంలో ‘చేతబడి’ కి సంబంధించి సినిమాలు కూడా రావటంతో దీని మీద కొంత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ‘చేతబడి’ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

చేతబడి కేవలం మూఢనమ్మకం అని కొట్టిపారేసే వారు ఉన్నారు. అలాగే దీన్ని నమ్మి భయాందోళనలకు గురి అయ్యే వారు ఉన్నారు.

చేతబడి కి పేర్లు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతొ పిలుస్తారు. విచ్క్రాఫ్ట్, చిల్లంగి, వూడూ, బాణామతి అనే పేర్లుతో పిలుస్తుంతారు.

చేతబడి ఎక్కడ ఎప్పుడు ప్రారంభం అయిందో తెలియదు. కానీ అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ కనపడుతుంది.