MoviesTollywood news in telugu

పెళ్లి ఊసెత్తని స్టార్ హీరోయిన్స్ …కారణం ఏమిటో తెలుసా?

Unmarried Actresses :కరోనా సమయంలో లాక్ డౌన్, అన్ లాక్ డౌన్ వేళల్లో ఇండస్ట్రీలో చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. యంగ్ హీరోలు నిఖిల్, నితిన్, రానా లకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, నిహారిక లాంటి వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే వయస్సు దాటిపోయినా సరే, ఇంకా చాలామంది హీరోయిన్లు పెళ్లి ఊసెత్తడం లేదు.

ఈ రోజుల్లో అమ్మాయికి పాతికేళ్లు వచ్చాయంటే పెళ్లెప్పుడు అని అందరూ అడగడం సహజం. కానీ మన హీరోయిన్లు మాత్రం 30 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి మాట ఏమాత్రం ఎత్తడం లేదు. ఇంకా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టి, హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లలో చూస్తే, ఇలా చాలామంది కనిపిస్తారు.

టబు వయసు 47 ఏళ్ళు; అమీషా పటేల్ వయసు 44 ఏళ్లు; అనుష్క వయసు 39 ఏళ్లు, రష్మి గౌతమ్ వయసు 38 ఏళ్లు, నయనతార, త్రిష వయసు 37 ఏళ్ళు ; శృతి హాసన్: వయసు 36 ఏళ్లు; కృతి కర్భందా, ఐశ్వర్య రాజేష్ వయసు 33 ఏళ్లు; తమన్నా, తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్ వయసు 32 ఏళ్లు; ఈషా రెబ్బా వయసు 31 ఏళ్లు పూజా హెగ్డే వయసు 30 ఏళ్ళు అయినా సరే వీళ్లకు పెళ్లి కాలేదు.