MoviesTollywood news in telugu

2020 లో బిజినెస్ స్టార్ట్ చేసిన సెలబ్రేటీస్ ఎంత మంది ఉన్నారో…?

Celebrities Who Started Businesses In 2020 : సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తూ అధిక మొత్తాలను రెమ్యునరేషన్ గా పొందుతున్న సెలబ్రిటీలు తమ సొమ్మును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతు న్నారు. ఎందుకంటే సినిమా జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు, అందుకే మంచి ఫామ్ లో ఉండగానే సొమ్ములు వెనకేసుకోవాలన్న యోచన వస్తోంది. ముఖ్యంగా హీరోల కన్నా హీరోయిన్స్ ఇలా వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతు న్నారు. ఫ్యాషన్ రంగంలో అనుభవంతో ఆ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. భర్తకన్నా ఎక్కువ ఆదాయం గడిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత పలు యాడ్స్ ద్వారా బాగానే రాబడుతోంది.

తాజాగా నేటితరం అమ్మాయిలు ఇష్టపడే డ్రెస్ లను సాకి పేరిట అందుబాటులోకి సమంత తెచ్చింది. ఈ వ్యాపారం బాగానే ఉన్నట్లు టాక్. అలాగే మరో అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది గౌతమ్ కిచ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడడమే కాకుండా కిచ్ అనే బ్రాండ్ తో ఇంటీరియర్ బిజినెస్ తో పాటు వివిధ రకాల వస్తువులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ ప్రత్యేక వీడియో కూడా రిలీజ్ చేసింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా న్యూ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ ఆ, అంబా అనే పేరిట ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. చిన్న పిల్లల టార్గెట్ గా వివిధ రకాల డిజైన్స్ ని అందుబాటులోకి తెస్తోంది.

కాగా ఇప్పటికే జిమ్ సెంటర్స్ రన్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాషన్ బ్రాండ్ తో పాటు ఎన్నో వ్యాపారాలను చేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఫ్రెష్ పేరిట తక్కువ ధరకు శానిటైజర్ అందించే వ్యాపారం స్టార్ట్ చేసాడు. త్వరలో మరిన్ని బ్రాండ్స్ కూడా ఇందులోకి తెస్తాడని అంటున్నారు. ఇక ఇటీవల బొంబాయి చట్నీ అంటూ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఆకట్టుకున్న విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇటీవల ఫ్రెండ్స్ తో కల్సి గుడ్ వైఫ్ కేఫ్ ని స్టార్ట్ చేసారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."