MoviesTollywood news in telugu

థియేటర్లలో ‘వి’ రిలీజ్ చేస్తే…మళ్ళీ చూస్తారా…?

V Movie :క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని విలన్ గా సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘వి’ మూవీ లాక్ డౌన్ లో ఓటిటి వేదికగా వచ్చింది. అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా కనిపించాడు. నాని విలనిజం నిండిన హీరోయిక్ పాత్ర చేసాడు. నిర్మాత దిల్ రాజు ‘వి’ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుండి భారీమొత్తంలోనే పుచ్చుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వి సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. నివేద థామస్ అతిథి రావు హైదరిలు హీరోయిన్లుగా నటించారు.

ఓటిటిలో రిలీజైన వి మూవీ అనుకున్న రేంజ్ లో కాదుకదా, మాములు హిట్ కూడా సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఇదే సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్టు టాక్. ఎందుకంటే, చిన్న హీరోలే వెయిట్ చేసి మరీ థియేటర్స్ కోసం చూస్తుంటే.. హీరో నాని ‘వి’ విషయంలో దారుణం జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఓటిటిలోనే వి సినిమా జనాల కు రీచ్ అవ్వనపుడు థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇంకేం చూస్తారని అంటున్నారు.

అది కూడా సెప్టెంబర్ లో విడుదలైన మూవీని ప్రస్తుతం 50శాతం సీటింగ్ సిస్టంలో రిలీజ్ చేస్తే ఇక అంతేసంగతులు అని కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఓటిటిలో విడుదల చేసిన సినిమాలను థియేటర్లలో ఆడియెన్స్ మళ్లీ చూడకపోవచ్చని ఓ వైపు సినీ నిపుణులు చెబుతూనే ఉన్నా, మరో వైపు డిస్ట్రీబ్యూషన్ వర్గాలు మాత్రం పెద్ద హీరోల సినిమా ఓటిటిలో డైరెక్ట్ రిలీజైన పర్వాలేదు.. థియేటర్లలో విడుదల చేస్తే థియేటర్ ఫీడింగ్ కోసమైనా పనికొస్తాయనే ఉద్దేశంతో విడుదల కు సై అంటున్నారట. ఇంతకీ ఏం చేస్తారో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."