MoviesTollywood news in telugu

సింగర్ షణ్ముఖ ప్రియ గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Singer Baby Shanmukha Priya Life Struggles : నాలుగేళ్ల వయస్సు నుంచే తన పాటతో అందరినీ ఆకర్షించిన సింగర్ షణ్ముఖ ప్రియ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తన సత్తా చాటింది. ఈమె పాట వినడానికి వేలాదిమంది ఎదురుచూస్తుంటారు. ఇండియా వైడ్ ఈమెకు ఫాన్స్ ఉన్నారు. ఈమె తల్లి దండ్రులిద్దరూ సంగీతంలో నిష్ణాతులే. శాస్త్రీయ సంగీతంలో ఎం ఏ పట్టా పొందిన శ్రీనివాస్ కుమార్, లతమ్మ లకు షణ్ముఖ ప్రియ జన్మించింది. తండ్రి శ్రీనివాస కుమార్ వైలెన్, వీణ వాయించడంలో దిట్ట.

చిన్నప్పటి నుంచే కూనిరాగాలు తీయడం వలన పేరెంట్స్ గుర్తించి సంగీతంలో షణ్ముఖ ప్రియకు మెళుకువలు నేర్పించారు. జి తెలుగులో నిర్వహించిన సరిగమప , లిటిల్ చాంప్ లో విన్నర్ గా నిల్చింది. మాటీవీలో సూపర్ సింగర్ 4లో ఫైనలిస్ట్ గా నిల్చింది. 2010లో తమిళ ఛానల్ లో కూడా సూపర్ స్టార్ విజేతగా నిల్చింది. అంతేకాదు, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించి నిర్వహించిన సూపర్ సింగర్స్ లో విన్ అయింది.

ఏ భాషయినా సరే, ఒకసారి వింటే అలవోకగా పాడడం షణ్ముఖ సొంతం. అలాగని స్టడీస్ వదిలిపెట్టలేదు. ఎప్పటికైనా సి ఏ చేయాలన్నది తన ఆశయమని చెప్పే షణ్ముఖప్రియ సినిమా పాటలు, జానపద గీతాలే కాదు, ఉర్దూ గజల్స్ కూడా పాడేస్తుంది. ది వాయిస్ ఆఫ్ కిడ్స్ లో పాల్గొని దేశవ్యాప్తంగా పరిచయం అయింది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడియల్ మీద దృష్టి పెట్టడంతో అందరూ ఆమె వైపే చూస్తున్నారు. ఇప్పటికే కొందరు తెలుగు వాళ్ళు ఇండియన్ ఐడియల్ గెలిచారు. ఇక రేసులో ఉన్న షణ్ముఖప్రియ కూడా విన్నర్ అవుతుందని ఆశిద్దాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."