MoviesTollywood news in telugu

అభిజిత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అఖిల్

Akhil and Abhijeeth :బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లాక్ డౌన్ సమయం లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. తెలిసిన పార్టిసిపెంట్స్ తక్కువ మంది ఉన్నా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఫోర్ తెలుగు సీజన్ విన్నర్ గా అభిజిత్, రన్నరప్ గా అఖిల్ ల్ అయిన సంగతి తెలిసిందే. బిగ్బాస్ హౌస్ నుంచి వచ్చాక అందరూ వరుస ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఆ క్రమంలో అఖిల్ అభిజిత్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ అఖిల్ మోనాల్ మధ్య సాగిన ట్రయాంగిల్ లవ్ ట్రాక్ బిగ్బాస్ సీజన్ ఫోర్ సక్సెస్ కి ఒక కారణం అయింది. మోనాల్ మొదట్లో అభిజిత్ తో సన్నిహితంగా ఉంది.

ఆ తర్వాత అభిజిత్,మోనాల్ మధ్య ధూరం పెరిగింది. ఆఖిల్ అభిజిత్ మధ్య కూడా కొన్ని గొడవలు కూడా జరిగాయి. గొడవలు జరిగాక అఖిల్ అభిజిత్ తో మాట్లాడటానికి ప్రయత్నించినా అభిజిత్ వైపు నుండి స్పందన లేదు. అభిజిత్ మోనాల్ మధ్య సమస్యలు పరిష్కారం చేద్దామని అనుకుంటున్నా కుదరలేదని, సమయం కావాలని అభిజిత్ చెప్పాడని ఆ తర్వాత ఇక ఏమీ మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. అఖిల్ కి కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. చూసి ఫైనల్ చేయాలని చెప్పాడు.