Healthhealth tips in telugu

Eggs:గుడ్డు వాడుతున్నారా…అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

egg benefits in telugu :గుడ్డు పొరపాటున పగలటం సహజమే. అలా పగిలి నేల మీద సొన కారితే దాన్ని బట్టతో తుడవకూడదు. దానిమీద ఉప్పుని చల్లాలి. అది బాగా ఆరాక ఊడ్చేస్తే పోతుంది.

గుడ్లను అధిక వాసస వచ్చే చేపలు, ఉల్లిపాయల వంటి వాటి దగ్గర ఉంచకూడదు. గుడ్డు పెంకుకు ఉన్న సూక్ష్మరంధ్రాల్లోంచి ఆ వాసన లోపలికి వెళ్ళుతుంది.

పళ్లేన్ని గిన్నెమీద ఏటవాలుగా పట్టుకుని ఆ పళ్లెంమీద ఎగ్‌ని కొడితే అందులోని రసం పళ్లెంమీదుగా గిన్నెలోకి జారుతుంది.

ఎగ్‌లోని పచ్చసొన, తెల్లసొనని తేలిగ్గా విడదీయటానికి ఒక చిట్కా ఉంది. గుడ్డును కొట్టి అందులోని సొనని పళ్లెంలోకి తీసుకొని పచ్చసొన మీద ఓ గ్లాసు ఉంచి గిన్నెలోకి వంచితే తెల్లసొన గిన్నెలోకి కారి పచ్చసొన ఆ గ్లాసు కింద ఉండిపోతుంది.

గుడ్డు మంచిదా పాడయ్యిందా తెలుసుకోవటానికి ఒక చిట్కా ఉంది. ఒక గ్లాస్ నీటిలో గుడ్డును వేస్తే నీటిలో తేలితే గుడ్డు పాడయినట్టు. అదే అడుగుకు చేరితే మంచి గుడ్డుగా అనుకోవచ్చు.

కోడిగుడ్డు ఆమ్లెట్‌ తయారీకి మునుపు పెన్‌మీద టేబుల్‌సాల్ట్‌తో తుడిస్తే ఆమ్లెట్‌ పెన్‌కి అంటుకోదు.

గుడ్డు ఉడకపెట్టబోయే ముందు సూదితో లావుగా ఉన్న వైపు చిన్నబెజ్జం చేస్తే పెంకు పగిలి సొన బయటకి రాదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.