MoviesTollywood news in telugu

రోజా వెండి తెరకు NO….బుల్లితెరకు YES…కారణం ఇదేనట…?

jabardasth roja :ఏ రంగం వాళ్ళైనా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ కొన్ని రంగాల్లో కొందరు మాత్రమే సెట్ అవుతారు. కొందరు అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్, ఉమ్మడి ఎపి సీఎం ఎన్టీఆర్ అలా సక్సెస్ అయ్యారు. ఇక కొందరు రాజకీయాల్లోకి వచ్చినా ఎక్కువకాలం ఉండలేక సినిమాలకు పరిమితం అయినవాళ్లు ఉన్నారు. చాలా మంది సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చినా, కొందరు మాత్రం పూర్తిగా సినిమాలకు దూరం అవుతుంటారు.

అయితే ఇప్పుడు ఇటు జనసేనలో చురుగ్గా ఉంటూ సినిమాల్లో రీ ఎంట్రీతో పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోయారు. మరోపక్క హిందూపురం నుంచి రెండోసారి గెలిచి బాలయ్య సినిమాల్లో కూడా బిజీగానే ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రోజా కూడా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ, మరోపక్క జబర్దస్త్ షో లో కంటిన్యూ అవుతోంది. అధికార పార్టీ తరఫున ఉండి.. ఇలా జబర్దస్త్‌ లాంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం గురించి ఓపక్క విమర్శలు వచ్చినా సరే, వాటిని రోజా పట్టించుకోవడం లేదు.

ఓపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎపి ఐ ఐ సి చైర్ పర్సన్ గా ఉంటూ, నగరి ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రోజాకు సినిమా ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయట. ఎప్పటి నుంచో చేస్తున్న బుల్లితెర వరకు తప్పదని, ఇక సిల్వర్ స్క్రీన్ మీదకు రావడం కుదరదని ఇటీవల కొన్ని సినిమాలకు నో చెప్పిందట. అందులో ఓ భారీ సినిమా కూడా ఉన్నట్లు టాక్. అయితే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పడంతో అమాత్య పదవికి ఇబ్బంది లేకుండా ముందునుంచే సినిమాలకు దూరంగా ఉండడమే మంచిదని రోజా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."