MoviesTollywood news in telugu

తెలుగులో ఒక్క ముక్క తెలుగు రాని హీరోలు ఎంతమంది ఉన్నారో…?

Tollywood Heroes :అప్పటి రోజుల్లో ANR, NTR, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలతో పాటు సావిత్రి, జామున, భానుమతి లాంటి హీరోయిన్స్ తెలుగుదనానికి ప్రతీకగా ఉండేవారు. బానుమతి అయితే కవయత్రి కావటంతో అచ్చమైన తెలుగులో మాట్లాడేది. బానుమతి గారు అయితే తన పాటలను తానే రాసుకొని పాడేవారు. ఆమెలో అంతలా టాలెంట్ ఉండేది.

ఎన్‌టి‌ఆర్ తెలుగు గురించి ప్రత్యెకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక నాగేశ్వర రావు,కృష్ణ కూడా తెలుగు బాగా మాట్లాడేవారు. ప్రస్తుతం నటిస్తున్న చాలా మంది నటులకు తెలుగు రాదు. వేరే ప్రాంతానికి చెందిన నటులకు తెలుగు రాదంటే పర్వాలేదు. కానీ మన ప్రాంతానికి చెందిన వారికే తెలుగు రాదంటే మాత్రం కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. వారి ఎవరో ఒకసారి చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేశ్ బాబుకి తెలుగు రాదట. డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్ లో రాసుకుని తెలుగులో చెప్తారట. సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధకు కూడా తెలుగు రాదు.సినిమాల్లో నటించే అప్పుడు ఈవిడకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వలన ఒకసారి చెప్పిన డైలాగు ఠక్కున మళ్ళీ చెప్పేది.

జయసుధకి వయస్సు పెరగటంతో జ్ణాపకశక్తి తగ్గి ప్రోమ్ప్టింగ్ అడుగుతుందట.డైలాగ్ కింగ్ మోహన్ బాబు పిల్లలకు కూడా తెలుగు రాదు. అలాగే రామ్ చరణ్ కి తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాడు. అక్కినేని వారసుడు అఖిల్ పరిస్తితి కూడా అంతే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."