MoviesTollywood news in telugu

అంతః పురం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

anthapuram movie child artist :క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ 1998 లో తీసిన అంతః పురం మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమా వచ్చి 22 ఏళ్ళయింది. అయినా అందరి మదిలో ఈ సినిమా మెదులుతుంది. అంతలా నటీనటుల నటన, దర్శక ప్రతిభ, సాంగ్స్ పిక్చరైజేషన్ అన్నీ సూపర్భ్. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ కృష్ణ ప్రదీప్ నటన తీసిపోనిది. కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా, హీరోయిన్ సౌందర్యకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడమే కాదు, ఉత్తమ సినిమాగా కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ పేరొచ్చింది.

సౌందర్యకు స్పెషల్ జ్యూరీ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జగపతిబాబుకు, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా, స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ప్రకాష్ రాజ్ కు వచ్చాయి. అలాగే ఉత్తమ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలంగాణ శకుంతల, బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎస్.జానకి, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా శ్రీనివాసరాజు, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తోట సాయి, ఇంకా చెప్పాలంటే, సౌందర్య పాత్రకి డబ్బింగ్ చెప్పిన నటి సరితకు కూడా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు వచ్చాయి. సౌందర్య కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కృష్ణప్రదీప్ నటన హైలెట్.

ఈ సినిమాలో నటించే సమయానికి ఆ బాబుకి రెండేళ్ళ వయస్సు. అయినా సరే, నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో కర్చీఫ్ నీటిలో తడిపి తుడిచే సీన్ లో మాస్టర్ కృష్ణప్రదీప్ పెర్ఫార్మెన్స్ కంటతడి పెట్టించింది. ప్రకాష్ రాజ్ ఫ్యాక్షనిస్టుగా బాబుని లాక్కుని ఆడించే సన్నివేశాల్లో సైతం కృష్ణ ప్రదీప్ అదరగొట్టాడు. ఇక స్టడీస్ దెబ్బతినకూడదని పేరెంట్స్ భావించి, సినిమాల్లో ఇక నటించేందుకు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు 24 ఏళ్ళ వయస్సులో చూడ్డానికి సినిమా హీరోలా మెరుస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే తనకు మొదట ఛాన్స్ ఇచ్చిన కృష్ణవంశీ ఆది గురువుగా చెబుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."