MoviesTollywood news in telugu

సెలబ్రిటీల డాటర్స్ క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు…చూస్తే షాక్ అవ్వాలసిందే

Sitara and Allu Arha :గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో సాంకేతికత పెరిగిపోవడం, అరచేతిలోనే సమస్త ప్రపంచం అన్నట్లుగా అందరి విషయాలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వైరలవుతున్నాయి. కొందరు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. దాంతో ఇళ్లల్లోని వాళ్ళ ఫోటోలు కూడా అందరికీ దర్శనమిస్తున్నాయి. దీంతో స్టార్ ల సన్స్ , డాటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా తమ స్టార్ డమ్ ను కూడా పెంచుకుంటున్నారు. స్టార్ కిడ్స్ చిన్నప్పుడే కావాల్సినంత స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. మరికొందరు యూట్యూబ్ స్టార్ లుగా వెలిగిపో తున్నారు.

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హా లాంటివాళ్లు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. మహేష్, నమ్రత సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుంటారు కూడా. ట్విట్టర్ ఇంస్టా గ్రామ్ లో సితార వీడియోస్ ఫోటోస్ పోస్ట్ చేయడంతో ముద్దుగా ఉండే సితార ‘సీతాపాప’గా ఫ్యాన్స్ కు మరింత చేరువైంది. సొంతంగా సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చెయ్యడంతో పాటు ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటుంది. తాజాగా పోస్ట్ చేసిన సితార స్పీడ్ బోట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నమత్ర బర్త్ డే సందర్భంగా ఇటీవల దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. అక్కడ బీచ్ లో ముఖ్యంగా సీతారా చేస్తున్న ఎంజాయ్ వీడియో ఫాన్స్ ని ఆకట్టుకుంటోంది. అలాగే సితార కన్నా చిన్నదే అయినప్పటికీ అల్లు అర్హా ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అర్హా క్యూట్ వీడియోలు ఫోటోలు అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తాయి. తాజాగా పింక్ లాంగ్ ఫ్రాక్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో బన్నీ వైఫ్ స్నేహా షేర్ చేస్తూ,.. ‘మై ప్రిన్సెస్’ అంటూ ఆ ఫొటోకు కోట్ చేసింది. దాన్ని రీట్వీట్ చేసిన బన్నీ.. ‘సో క్యూట్’ అంటూ రీ ట్వీట్ చేశారు. ఇక ఫాన్స్ ఆగుతారా తెగ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."