MoviesTollywood news in telugu

మెగాస్టార్ తో ఆఫర్ రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్…ఎవరో…?

Telugu Actress Aamani :కొందరు హీరోయిన్స్ తక్కువ సినిమాలు చేసినా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుని ఆడియన్స్ మదిలో చెరగని ముద్రవేసుకుంటారు. అందులో నటి ఆమని ఒకరు. ఇటు తెలుగు, అటు తమిళంలో చేసింది పదుల సంఖ్యలో సినిమాలే అయినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, మావిచిగురు, ఆ నలుగురు, చందమామ కథలు సినిమాలు ఆమనికి నటిగా మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ముఖ్య పాత్రలో ఆమని అంటిస్తోంది.

అయితే రెండు రోజుల క్రితం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో స్వల్ప అస్వస్థతకు లోనైన ఆమని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. సినిమా ఛాన్స్ లతో బిజీగా ఉంటూ పలు టీవీ ఛానెళ్లలోని ఈవెంట్లలో కూడా అప్పుడప్పుడూ ఆమని సందడి చేస్తోంది. ఆమని ప్రధాన పాత్రలో నటించిన అమ్మ దీవెన సినిమా శుక్రవారం విడుదల కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇంటర్యూ ఇస్తూ .. ఆసక్తికర అంశం వెల్లడించింది. హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లో చాలామంది అగ్ర హీరోలతో ఆమని జోడీకట్టి, మెప్పించిన ఆమని … మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే మాత్రం సున్నితంగా తిరస్కరించిందట.

నిజానికి చిరంజీవి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. చిరంజీవితో నటించలేదనే బెంగ తనకు ఉందని అయితే కొన్ని కారణాల వల్ల చిరంజీవితో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని ఇంటర్వ్యూలో ఆమని చెప్పు కొచ్చింది. ఒక సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించే అవకాశం వచ్చిందని తాను డ్రీమ్ బోయ్ లా భావించిన వ్యక్తికి సోదరిగా నటించాలని అనుకోలేదని ఆమె పేర్కొంది. చిరంజీవికి సోదరిగా నటించడం కుదరని పని కావడంతో సున్నితంగా వద్దనుకున్నట్లు చెప్పింది