ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి
vijay childhood photos : చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా సత్తా చాటి, పెద్దయ్యాక హీరోలుగా దుమ్మురేపుతున్నారు. అటు కోలీవుడు, ఇటు బాలీవుడ్ లో ఇలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోలలో తమిళ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానంలో ఉంటాడు. నిజానికి 1984లో తమిళ ప్రముఖ సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన “వెట్రి” అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయ్ మొదటగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు.
తాజాగా విజయ్ కి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో చిన్నప్పుడు విజయ్ ప్రముఖ సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ తో కలిసి షూటింగులో పాల్గొంటున్న సమయంలో తీయించుకున్నట్లు అర్ధం అవుతోంది. ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అయితే సోషల్ మీడియాకి విజయ్ దూరంగా ఉన్నప్పటికీ అతడి ఫాన్స్ మాత్రం ఈ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఇక పెద్దయ్యాక 1996లో ప్రముఖ దర్శకుడు విక్రమన్ దర్శకత్వం వహించిన “పోవే ఉనక్కగా” అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన మొదటి చిత్రంతో సినీ ప్రేక్షకుల మదిని దోచాడు. అయితే కెరీర్ మొదట్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న విజయ్ ఏ మాత్రం నిరాశ చెందకుండా, మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్తూ వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.
ఇక ఈ సంక్రాంతికి విజయ్ హీరోగా రిలీజైన “మాస్టర్” మూవీ అనుకున్న రేంజ్ లో లేదు. ఎక్కడో తేడా కొట్టింది. పైగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత వచ్చిన సినిమా కావడంతో జనాలు కూడా ఎక్కువ థియేటర్లవైపు కన్నెత్తి చూడ్డంలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన “మాస్టర్ చిత్రం ప్లాప్ కావడంతో విజయ్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో బాగా ఆలోచించి అడుగులు వేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్నిచిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో కూడా రిలీజ్ చేసేసారు.