నటుడు అజయ్ భార్య ఎవరు…ఏమి చేస్తుందో తెలుసా?

star villain ajay wife :విక్రమార్కుడు మూవీలో టిక్కా పాత్ర ఎంతటి భయంకరంగా ఉంటుందో ఊహించలేం. అలాంటి పాత్రలో మెప్పించి, టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా తన సత్తా చాటిన నటుడు అజయ్ సహాయనటుడిగా కూడా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పోకిరిలో మహేష్ ఫ్రెండ్ గా అజయ్ చేసిన నటనకు, విక్రమార్కుడులా విలన్ గా చేసిన నటనకు అసలు పోలిక ఉండదు.

నిజానికి అజయ్ హీరోగా వచ్చిన సారాయి వీర్రాజు సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో హీరోగా ప్రయోగాలు చేయలేదు. నటనలో శిక్షణ తీసుకున్న సంవత్సరానికే అజయ్ కు కౌరవుడు అనే సినిమాలో అవకాశం దక్కింది. ఆ తరువాత పవన్ హీరోగా తెరకెక్కిన ఖుషీ సినిమాలో అజయ్ కీలక పాత్రలో నటించారు.

తనదైన నటనతో ఇండస్ట్రీలో అజయ్ దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు సై, ఒక్కడు, ఇష్క్, దూకుడు, గబ్బర్ సింగ్, అ ఆ సినిమాలతో పాటు గతేడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, భీష్మ సినిమాలు హిట్ కావడంతో పాటు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక అజయ్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన భార్య పేరు శ్వేతా రావూరి. ఫ్యాషన్ డిజైనర్ గా శ్వేత మిసెస్ ఇండియా పోటీలలో ఫైనల్ పోటీదారిణి గా నిల్చింది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారని టాక్.

అజయ్ ప్రోత్సాహంతో శ్వేత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో అజయ్ మాట్లాడుతూ తన సినిమా ప్రయాణంలో తన తల్లిదండ్రులు, శ్వేత ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పాడు. తమకు అబ్బాయిలని, పిల్లలు తన సినిమాలను చూసినప్పుడు ఎందుకు ఎప్పుడూ దెబ్బలు తింటుంటా వని అడుగుతారని అజయ్ చెప్పాడు. అజయ్ ప్రచారం ఆచార్య, పుష్ప సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అజయ్ వెకేషన్ లో శ్వేత, అతని పిల్లలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.