సుమంత్‌కు కాబోయే భార్య ఏమి చేస్తుందో తెలుసా?
Sumanth Ashwin Marriage : సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ తూనీగ తూనీగ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కేరింత.. అంతకుముందు ఆ తర్వాత.. లవర్స్ లాంటి సినిమాలు చేశాడు. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్ తర్వాత సుమంత్ సినిమాలు ఏమి చేయలేదు.
రెండు సినిమాలు చేస్తున్న కరోనా కరనంగా అగాయి. సడన్ గా పెళ్లి వార్త చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎం.ఎస్. రాజు పెళ్లి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎం.ఎస్. రాజు తనకు కాబోయే కోడలు గురించి చెప్తూ…ఆమె పేరు దీపిక అని… ఆమె లాంటి మంచి అమ్మాయి తమ ఇంటికి కోడలిగా రానుండటం ఆనందంగా ఉందని.. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డల్లాస్‌లో రీసెర్చ్ సైంటిస్టుగా పని చేస్తోందని చెప్పారు….
పెళ్ళికి కేవలం వంద మందిని మాత్రమే పిలుస్తున్నామని, సంప్రదాయం ప్రకారం పెళ్లి మూడు రోజులు వేడుక జరుగుతుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌజ్‌లో ఈ పెళ్లి వేడుక జరుగుతుందని అన్నారు.