బిగ్ బాస్ షో పై హారిక హాట్ కామెంట్స్

Bigg Boss Harika :ఎన్ని వివాదాలున్నా స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ రియాల్టీ షో సూపర్ హిట్ అయింది. ఇప్పటికే నాలుగు షోస్ పూర్తయింది. తెలుగులో బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో గా మారిన బిగ్ బాస్ షో సీజన్ 4లో దేత్తడి హారిక పాపులారిటీని మరింత పెంచుకుని, టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరుగా నిలిచింది. ఈమెకు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించే ఆఫర్లు వచ్చాయంటూ గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ ఫ్రస్టేషన్ పేరుతో హారిక దేత్తడి ఛానల్ లో ఒక వీడియో రిలీజ్ చేసింది.

అయితే తనపై వచ్చే గాసిప్స్ గురించి, బిగ్ బాస్ షో గురించి ఎదురవుతున్న ప్రశ్నల గురించి హారిక ఆ వీడియోలో అనేక ఆసక్తికర విషయాలను చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో ఫోన్ లేదు. టీవీ లేదు. కమ్యూనికేషన్ లేకుండా, స్నేహితులు, బంధువులు లేకుండా బిగ్ బాస్ హౌస్ లో మేము ఏ కోమాలోకి వెళ్లామో చెబితే తప్ప అర్థం కాదని ఆమె చెప్పుకొచ్చింద. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అందరూ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.? అని అడగడంపై స్పందిస్తూ, ప్లానా నా బొందా అనేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, నవ్వుకుంటూ స్వాగతం పలికి బాధ పడుతూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బయటకు పంపించవచ్చని చెప్పింది.

హౌస్ లో డ్యాన్సులు వేశామా .? టాస్క్ లు ఆడామా ? నామినేట్ చేసుకున్నామా.? ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేశామా.? అనే సోది తప్ప ఏమీ లేదని తేల్చేసింది. హౌస్ లో ఉదయం రెండు గంటలు మాత్రమే హాట్ వాటర్ ఇస్తారని, రెండు గంటల్లో పదహారు మంది ఫ్రెష్ అప్ అవ్వాలంటే ఎలా.? అని ప్రశ్నించింది అక్కడ వాష్ రూమ్ కోసం కొట్లాడుకోవడాన్ని బ్లాక్ బస్టర్ సినిమా టికెట్ల కోసం ట్రై చేసినట్టుగా ఉందని అంది. అయితే నిద్రను ఎలా ఆపుకోవాలో హౌస్ లో నేర్చు కున్నానంది. స్వీట్, కూల్ డ్రింక్, పిజ్జా, బర్గర్, కొబ్బరి చట్నీ కూడా లేవట.