ఈ హీరోని గుర్తు పట్టారా…ఎలా చనిపోయాడో తెలుసా?
Telugu Actor kamalakar reddy :చిత్ర పరిశ్రమలోకి ఎందరో వస్తుంటారు వెళ్తుంటారు. ఇక కొందరు అర్ధాంతరంగా ఈలోకం నుంచి వెళ్ళిపోతారు. సీనియర్ దర్శకుడు డాక్టర్ కిరణ్ దర్శకత్వం వహించిన “అభి” అనే చిత్రంలో హీరోగా నటించి సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమైన నటుడు కమలాకర్ రెడ్డి చిన్నవయస్సులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతడి సోదరుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా పని చేశాడు.
సంచలనం, హాసిని, బ్యాండ్ బాలు, తదితర చిత్రాల్లో హీరోగా నటించి, కెరియర్ లో హీరోగా అప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో అనుకోకుండా గుండె జబ్బుకి ప్రాణాలు వదిలాడు. నిజానికి అతడు నటించిన సినిమాలు ఆకట్టుకోలేకపోయినా నటుడిగా మాత్రం మంచి గుర్తింపు మాత్రం తీసుకు వచ్చాయి. అయితే తెలుగులో చివరగా కమలాకర్ రెడ్డి బ్యాండ్ బాలు చిత్రంలో నటించినా గుండె పోటు కారణంగా విడుదల కాకముందే అనుకోకుండా మృత్యువాత పడ్డాడు.
ఉన్నత కుటుంబం నుంచి కమలా కర్ రెడ్డి సినిమా పరిశ్రమకి వచ్చినప్పటికీ సొంతంగా తన టాలెంట్ తో హీరోగా ఛాన్స్ లు అందుకున్నాడు. అప్పటికే గుండె పోటు సమస్యతో బాధ పడుతున్న కమలాకర్ రెడ్డికి ఉన్నట్లుండి హఠాత్తుగా గుండె పోటు రావడంతో చెన్నైలో ఓ ప్రముఖ ఆసుపత్రికి చికిత్స కు తరలించారు. కానీ అప్పటికే గుండె పోటు సమస్య అధికమవడంతో జూలై 14న ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచాడు.

