అన్నయ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి రామ్ శంకర్

Puri Jagannadh Brother Sairam Shankar :పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న సామెత రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంట్లో రివర్స్ అయింది. ఎందుకంటే యితడు దర్శకత్వం వహించిన “143” అనే చిత్రంలో పూరీ బ్రదర్ సాయిరాం శంకర్ హీరోగా నటించి సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు. విజయాన్ని అందుకున్నాడు. నిజానికి బద్రి, ఇడియట్, బాచి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, తదితర చిత్రాలకు పూరి దగ్గర సాయిరాం శంకర్ అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన “143” అనే చిత్రంలో హీరోగా నటించి సక్సెస్ అందుకు న్నాడు. ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నాడు.

తెలుగులో “వాడు నేను కాదు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న హీరో సాయిరాం శంకర్ తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం తదితర భాషలలో కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ చిత్రంలో మత్తు పదార్థాలకు బానిసయిన ఓ యువకుడి పాత్రలో అలాగే న్యాయం కోసం పోరాటం చేసేటువంటి లాయర్ పాత్రలో కనిపిస్తానని , 80 శాతం చిత్రీకరణ పనులు పూర్తయ్యాయని , అయితే చిన్న సమస్య కారణంగా కొంతకాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపి వేశామని వివరించాడు.

అలాగే ఈ చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే జగదాంబ అనే మరో చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తనని హీరోగా నిబెలట్టేందుకు ఎంతో కష్టపడ్డాడని సాయిరాం శంకర్ చెప్పుకొచ్చాడు.ఈ మధ్య కాలంలో డబ్బు విషయం లో సొంత అన్న దమ్ములయినా సరే అప్పుడప్పుడు గొడవ పడడం నేను చాలా చూశానని, కానీ తమ మధ్య ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేవని ఇకముందు కూడా రావని తేల్చిచెప్పాడు.

ముఖ్యంగా సినిమా మార్కెట్లో పూరి కి మంచి డిమాండ్ ఉందని, తనకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా పిలిచి ఛాన్స్ ఇస్తాడని తెలిపాడు. అయితే తాను సొంతంగా తన టాలెంట్ చూపించుకునే పనిలో ఉన్నానన్నాడు. అన్నయ్య చిత్రంలో నటించడం వల్ల, ఒకవేళ ఆ పాత్రకి న్యాయం చేయలేక పోతే కొంతమేర సినిమా దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే ఈ మధ్య కాలంలో తాను పూరి దర్శకత్వం వహించిన చిత్రాలలో నటించలేదని వివరించాడు.