MoviesTollywood news in telugu

జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర ఆస్తుల విలువ తెలిస్తే..?

jabardasth comedian chammak chandra :తెలుగు టీవీ చానల్స్ లో మోస్ట్ పాపులర్ రియాల్టీ షోగా రాణిస్తున్న ప్రోగ్రాం ఈటీవీలో జబర్ దస్త్ కార్యక్రమం. మొదట్లో విమర్శలు వచ్చినా వీరలెవెల్లో క్లిక్ అయిన షో ఇది. 2013లో మొదలైన ఈ షో అవిచ్ఛిన్నంగా సాగుతోంది. టిఆర్పి రేటింగ్ అదిరిపోతోంది. 6ఏళ్ళ వయస్సు నుంచి 60ఏళ్ళ ప్రాయం వరకూ అందరినీ ఆకర్షించి అలరిస్తున్న షోగా గుర్తింపు పొందింది. ఇక ఈ షోద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఎదిగారు. కొందరు బయట షోలతో కూడా సంపాదన పెంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా ‘జబర్ దస్త్’ఫెమ్ అనే పేరు మారుమోగిపోతోంది. ఇక ఆర్ధికంగా కూడా బానే నిలదొక్కుకున్నారు.

జబర్ దస్త్ లో నటించిన వాళ్ళు యాంకర్లుగా, జూనియర్ ఆర్టిస్టులుగా,హీరోలుగా,రాణిస్తూ సంతోహాసంగా వున్నారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడి ఈ షోలో ఎంట్రీ సంపాదించినవాళ్లు,ఇప్పుడు పదిమందికీ సాయం చేసే స్థాయికి కూడా కొందరు ఎదిగారు. ఇక ఈ షో ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు చమక్ చంద్ర. యితడు కామెడీతో పాటు అమ్మాయి వేషం వేసి, అచ్చం అమ్మాయే అనిపించేలా జీవిస్తాడు.

యితడు అమ్మాయి వేషం కట్టి, షో లో కనిపిస్తే చాలు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారు. మిగిలిన వారికి భిన్నంగా స్కిట్స్ రూపొందించి ప్రదర్శించడంలో దిట్ట.ఇక సినిమాల్లో కూడా తనదైన బాణీలో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అద్దెంట్లో ఉండే చమక్ చంద్ర, అద్దె కట్టడానికే ఇబ్బందులు పడ్డాడు. ఐతే ఇప్పుడు మణికొండలో కోటి రూపాయలు పెట్టి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.

అంతేకాదు ఓ బెంజి కారు కూడా కొనేసాడు. చమక్ చంద్ర లెవెల్ పూర్తిగా ఇలా మారిపోవడం చూసి చాలామంది షాకయ్యారు. కష్టపడే తత్త్వం,చిత్తశుద్ధి ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వున్నా, ఉన్నత స్థాయికి చేయవచ్చనడానికి చమక్ చంద్ర తార్కాణం. అంతేకాకుండా కొన్ని భూములను కూడా కొనుగోలు చేశాడట చమ్మక్ చంద్ర.ఆయన సొంత ఊర్లో కూడా చాలా ఆస్తులు ఉన్నాయని తెలిసింది.

కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి నాగబాబు తో పాటు వెళ్లగా.జీ తెలుగులో అదిరింది షో ద్వారా కామెడీ లను అందించాడు.కానీ ఈ షో కూడా ఇటీవలే ముగిసింది.ఇక జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కొన్ని కారణాలు కూడా తెలిపాడు చమ్మక్ చంద్ర.