స్టార్ హీరో కూతురుని గుర్తుపట్టారా… ఈమె ఏం చేసిందో తెలుసా ?
mohan lal daughter :సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ హోస్ట్ గా ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించారు అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి తెలుగులో కూడా అభిమానులకు చేరువయ్యారు ఇప్పుడు మోహన్ లాల్ కూతురు విస్మయ తండ్రి గర్వపడేలా చేశారు. కొన్ని రోజుల క్రితం బరువు తగ్గి వార్తల్లోకి వచ్చినా విస్మయ ఇప్పుడు ఒక పుస్తకం రాసి తండ్రి గర్వపడేలా చేసింది.
గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్ పేరుతో విస్మయ రాసిన ఈ నవలను ప్రముఖ సంస్థలలో ఒకటైన పెంగ్విన్ ఇండియా సంస్థ విడుదల చేస్తోంది.ఫిబ్రవరి 14 అంటే నిన్నటి నుంచి దేశంలోని అన్ని ప్రముఖ బుక్ స్టోర్స్ లో ఈ పుస్తకం అందుబాటులో ఉంటుందని, ఈ పుస్తకం చదివి అభిప్రాయం చెప్పాలని అభిమానులను కోరారు మోహన్ లాల్.
మరోవైపు విస్మయ గతంలో అధిక బరువుతో బాధ పడగా థాయ్ లాండ్ కు వెళ్లి బరువు తగ్గి అట్రాక్టివ్ లుక్ లోకి మారారు.ఏకంగా 22 కిలోల బరువు తగ్గి మోహన్ లాల్ అభిమానులను సైతం ఆమె ఆశ్చర్యపోయేలా చేశారు.

