రాధే శ్యామ్ సినిమా ట్రైన్ సెట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ?

Prabhas Radhe Shyam :ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాధేశ్యాం షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు ఈ సినిమా లవ్ స్టోరీ కావడంతో ప్రభాస్ లుక్, స్టైల్, సినిమా లుక్ అన్ని డిఫరెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాతలు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు.

ఈ సినిమాలో ప్రభాస్ కాస్ట్యూమ్ కి ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఇక రైల్వే స్టేషన్ సెట్ కోసం 1.6 కోట్లను ఖర్చు పెట్టారట. ఈ సీన్ చేయటానికి ఇటలీలో ప్లాన్ చేశారట కానీ కరోనా కారణంగా అన్నపూర్ణ స్టూడియోలోనే భారీ ఖర్చుతో రైల్వే స్టేషన్ సెట్ వేశారట.